హనీమూన్‌లో రొమాంటిక్‌ కపుల్‌!

ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన నయనతార-విఘ్నేశ్‌ ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

Image: Instagram/Vignesh Shivan

ఇది వరకే ఈ జంట హనీమూన్‌కి థాయ్‌లాండ్‌ వెళ్లి వచ్చింది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిన వీరిద్దరూ కాస్త విరామం తీసుకొని మరోసారి హనీమూన్‌కి స్పెయిన్‌ వెళ్లారు.

Image: Instagram/Vignesh Shivan

అక్కడి అందాలు ఆస్వాదిస్తూ.. నగర వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. రొమాంటిక్‌గా పోజులిస్తూ ఫొటోలు దిగుతున్నారు.

Image: Instagram/Vignesh Shivan

ఆ ఫొటోలను విఘ్నేశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.

Image: Instagram/Vignesh Shivan

క్యూట్‌ కపుల్‌, హ్యాప్పియెస్ట్‌ కపుల్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Image: Instagram/Vignesh Shivan

బార్సిలోనాలోని కిస్‌వాల్‌ ముందు నయన్‌-విఘ్నేశ్‌ సరదాగా ఫొటో దిగారు.

Image: Instagram/Vignesh Shivan

చర్చి ముందు నయనతార నుదుటిపై ముద్దు పెడుతూ.. విఘ్నేశ్‌ తన ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడిలా.

Image: Instagram/Vignesh Shivan

స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా నయన్‌-విఘ్నేశ్‌ స్పెయిన్‌లోనే జరుపుకొన్నారు. బార్సిలోనాలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించి దేశభక్తి చాటుకున్నారు.

Image: Instagram/Vignesh Shivan

ప్రస్తుతం నయనతార.. మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, షారుక్‌ఖాన్‌ ‘జవాన్‌’తోపాటు మరో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది.

Image: Instagram/Vignesh Shivan

మలయాళంలో టాప్‌ 10 సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మీర్జాపూర్‌ గర్ల్‌.. హర్షితా గౌర్‌

Eenadu.net Home