సవాలు విసిరే పాత్రలంటేనే ఇష్టం..!

‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‌’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ నెల 18న విడుదల కానుంది ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ఇప్పటికే‘ దీని టీజర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇందులో నయన్‌ విఘ్నేశ్‌లు వారి వివాహ సన్నాహాల గురించి మాట్లాడుకోవడం చూపించారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించి.. లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, 75కి పైగా చిత్రాల్లో నటించింది.

వెంకటేశ్‌ హీరోగా ‘లక్ష్మీ’తో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై.. చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించింది.

ఈమె నటనతో నంది, ఏడు సైమా అవార్డులు సహా మరెన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

గతేడాది హిందీలో తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’ హిట్‌ కావడంతో అక్కడా ఆఫర్లు వరుస కడుతున్నాయి.

‘నేనూ రౌడీనే’ షూటింగ్‌లో నయనతార, ఆ సినిమా దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లు స్నేహితులయ్యారు. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారింది.

కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న నయన్‌ - విఘ్నేశ్‌ 2022లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

‘నా కనుబొమలు అంటే నాకు ఇష్టం. ప్రతి ఈవెంట్‌కు వాటి ఆకారాన్ని మారుస్తా. వాటి కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తా’అని చెప్పింది. 

సరోగసి పద్ధతిలో ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఈ స్వీట్‌ కపుల్‌.

తమ ట్విన్‌ బేబీ బాయ్స్‌కు ఉయిర్‌, ఉలగమ్‌ అని నామకరణం చేసింది నయన్.. ఉయిర్ అంటే జీవితం. ఉలగమ్‌ అంటే ప్రపంచం. ఈ చిన్నారులే మా ప్రపంచం, జీవితం అని ఓ సందర్భంలో నయన్ తెలిపింది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home