‘గాడ్‌ఫాదర్‌’తో లేడీ సూపర్‌ స్టార్‌ 

‘మానస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో తెరంగేట్రం చేసింది నటి నయనతార. ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూ నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ లేడీ సూపర్‌ స్టార్‌గా మారింది.

Image:SocialMedia

ప్రస్తుతం ఆమె అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Image:SocialMedia

మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా మోహన్‌రాజా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది.

Image:SocialMedia

ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది నయనతార.

Image:SocialMedia

నయన్‌.. 18 నవంబర్‌, 1984న బెంగళూరులో జన్మించింది. ఈ అందాల తార అసలు పేరు డయాన మరియమ్‌ కురియన్‌.

Image:SocialMedia

‘చంద్రముఖి’, ‘వల్లభ’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ ‘లక్ష్మీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Image:SocialMedia

‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శీను’, ‘తులసి’, ‘బిల్లా’, ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘గ్రీకు వీరుడు’ తదితర సినిమాల్లో విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకుంది.

Image:SocialMedia

నయనతార సుమారు ఏడేళ్లపాటు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను ప్రేమించి ఈ ఏడాది జూన్‌లో వివాహమాడింది.

Image:SocialMedia

పెళ్లిలో పుత్తడిబొమ్మలా నయన్‌ ధరించిన నగలన్నీ విఘ్నేష్‌ ప్రేమతో బహుకరించినవే. ఇందులో తను చేతి వేలికి ధరించిన ఒక్క వజ్రపుటుంగరం విలువే రూ.5 కోట్లు ఉంటుందట.

Image:SocialMedia

నయన్‌ తన ప్రియుడు, భర్త విఘ్నేష్‌కి చెన్నైలో ఒక బంగ్లాని కానుకగా ఇచ్చింది. దీని విలువ అక్షరాలా రూ.20 కోట్లపైనే ఉంటుందని సమాచారం.

Image:SocialMedia

ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. షారుఖ్‌ఖాన్‌ సరసన ‘జవాన్‌’తోపాటు కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తోంది.

Image:SocialMedia

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

దర్శకుల గురించి తారక్‌ సూపర్‌ మాటలు!

Eenadu.net Home