నీలమ్ గిల్.. ఇప్పుడు సెన్సేషనల్!
అంతర్జాతీయ మోడల్ నీలమ్ కౌర్ గిల్ ఇప్పుడు మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. కారణం.. హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోతో డిన్నర్ డేట్‌కి వెళ్లడమే.
Image:Inatgram/NEELAM KAUR GILL
తాజాగా నీలమ్.. డికాప్రియో కలిసి ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి.
Image:Inatgram/NEELAM KAUR GILL
ఇంతకీ ఈ నీలమ్ గిల్ ఎవరంటే.. యూకేలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన యువతి.
Image:Inatgram/NEELAM KAUR GILL
ఇంగ్లాండ్‌లో 1995 ఏప్రిల్ 27న పంజాబీ కుటుంబంలో జన్మించింది.
Image:Inatgram/NEELAM KAUR GILL
నీలమ్ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారట. సవతి తండ్రి తనను ఎంతో ప్రేమతో పెంచారని ఓ సందర్భంలో తెలిపింది.
Image:Inatgram/NEELAM KAUR GILL
పద్నాలుగేళ్ల వయసులోనే నెక్ట్స్ మోడల్ మేనేజ్‌మెంట్‌లో చేరి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
Image:Inatgram/NEELAM KAUR GILL
లండన్ ఫ్యాషన్ వీక్‌సహా అనేక ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Image:Inatgram/NEELAM KAUR GILL
అంతర్జాతీయ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. పలు యాడ్స్‌లోనూ మెరిసింది.
Image:Inatgram/NEELAM KAUR GILL
వోగ్ ఇండియా మ్యాగజైన్‌పై కూడా నీలమ్ ఫొటోలు ప్రచురితమయ్యాయి.
Image:Inatgram/NEELAM KAUR GILL
ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఈ భామ హొయలొలికించింది. బ్లాక్, గ్రీన్ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది.
Image:Inatgram/NEELAM KAUR GILL
అంతకుముందు ముంబయిలో ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ ప్రారంభోత్సవానికి కూడా నీలమ్ హాజరైంది.
Image:Inatgram/NEELAM KAUR GILL