హైదరాబాదీ సోయగం.. నేహా దేశ్‌పాండే..

‘దిల్‌ దివానా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నేహా దేశ్‌ పాండే ఇప్పుడు ‘రాజు గారి కోడి పులావ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జులై 29న విడుదల కానుంది.

photos: instagram

ఈ చిత్రానికి శివకోన దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ కథ అడవిలో, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగనుంది. 

నేహా 1995లో హైదరాబాద్‌లో పుట్టింది. మోడల్‌గా తన కెరియర్‌ని మొదలు పెట్టింది. తర్వాత 2014లో ‘దిల్‌ దివానా’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 

తర్వాత వరసగా ‘ద బెల్స్‌’, ‘శ్రీ నిలయం’, ‘వజ్రాలు కావాలా నాయనా’, ‘దడ పుట్టిస్తా’, ‘బిచ్చగాడా మజాకా’, ‘వాడేనా’, ‘ద కిల్లర్‌’ (2021) వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

మూడేళ్ల వరకూ అవకాశాలేవీ లేవు. ప్రస్తుతం ‘రాజు గారి కోడిపులావ్‌’తో అలరించనుంది. కెరియర్‌లో ఒక్క హిట్‌ కూడా లేని నేహా ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు పెట్టుకుందట..

అడవిలో అడ్వెంచర్లు చేస్తూ సాగే ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. 

ఈ హైదరాబాదీ అందానికి స్విమ్మింగ్‌ చేయటం అంటే చాలా ఇష్టమట. క్రమం తప్పకుండా స్విమ్మింగ్‌ చేస్తానంటుంది. అంతేకాక స్కైడైవింగ్‌ చేయటం కూడా బాగా నచ్చుతుందట.

ఖాళీ సమయం దొరికితే క్రికెట్‌ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సమయాన్ని గడిపేస్తుందట. ట్రావెలింగ్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని రుచి చూడటం కూడా ఇష్టమంటుంది నేహా. 

సాధారణంగా ట్రిప్పులంటే ఇతర దేశాలకో, పురాతన కట్టడాలు చూసేందుకో వెళతారు. కానీ నేహా ట్రిప్‌ అంటే మాత్రం అడవులు, సరస్సులు చూసేందుకే ఇష్టపడుతుంది. 

ఈ సుందరికి నలుపు రంగంటే చాలా ఇష్టమట.. తన ఇన్‌స్టాలో కూడా నలుపు రంగు దుస్తులతో ఉన్న ఫొటోలనే ఎక్కువగా పంచుకుంటుంది. 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home