గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

‘డీజే టిల్లు’ ఎంత ఫేమసో... రాధిక కూడా అంత ఫేమస్‌. సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఆమె ఫేమసే. మరోసారి అలాంటి పేరు తెచ్చుకోవడానికి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది నేహా శెట్టి.

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. గోదావరి జిల్లాల వాతావరణంలో తెరకెక్కిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మే 31న విడుదల కానుంది. 

ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పింది. మన రాధిక అలియాస్‌ నేహా.

‘టిల్లు స్క్వేర్‌’లోనూ తళుక్కున మెరిసి ఈ అందం అదరగొట్టింది. కనిపించింది కాసేపే అయినా వావ్‌ అనిపించింది.

This browser does not support the video element.

గతేడాది ‘బెదురులంక 2012’, ‘రూల్స్‌ రంజన్‌’తో మెప్పించింది. ‘రూల్స్‌ రంజన్‌’లో ‘సమ్మోహనుడా...’ పాటకు నేహా డ్యాన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 

టాలీవుడ్‌లో ఈ భామ ఫేవరెట్‌ హీరో అల్లుఅర్జున్‌. ఎప్పటికైనా తనతో సినిమా చేయాలనేది ఆమె కోరిక. 

మూడో తరగతిలో ఉన్నప్పుడే హార్లిక్స్‌, కిసాన్‌ జామ్‌ యాడ్స్‌లో నటించింది. హృతిక్‌ రోషన్‌ని స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లోకి వచ్చింది.

శ్రీదేవి, నయనతార, అనుష్కకు వీరాభిమాని. బోర్‌ అనిపించినప్పుడల్లా వారి సినిమాలు చూస్తుంది. 

ట్రావెలింగ్‌ హాబీ. షూటింగ్‌ నుంచి విరామం దొరికినప్పుడల్లా అమ్మానాన్నలతో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుంది. అలా వెళ్లడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అని అంటోంది.

గిటార్‌ ప్లే చేయడమంటే ఇష్టం. చాలా కష్టపడి నేర్చుకుందట. ఈమెకు సంప్రదాయ నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది.

This browser does not support the video element.

డ్యాన్స్ అంటే ఇష్టపడే నేహా రీల్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. ఆమె ఇన్‌స్టా ఖాతాకి ఫాలోవర్లు కోటి మందికి పైమాటే!

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home