మూడ్, సిచ్యువేషన్ బాగుంటే.. ట్యూన్‌కి రెడీ!
‘టైసన్ నాయుడు’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేహా శెట్టి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు.
‘ముంగారు మేల్ 2’తో 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2018లో ‘మెహబూబా’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినా.. ‘గల్లీ రౌడీ’తో గుర్తింపు దక్కించుకుంది.
‘డీజే టిల్లు’లో గ్లామర్ డోసు పెంచి.. ‘రాధిక’గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
నాలుగో తరగతిలో ఉన్నప్పటి నుంచే ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టింది.
ఈ బెంగళూరు భామకి బొబ్బట్లు అంటే ఎంతో ఇష్టం. దొరికితే ఓ పట్టు పట్టేయడమే అని చెప్పింది.
‘డ్యాన్స్ అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. స్టేజ్ ఎక్కితే నన్నెవరూ ఆపలేరు..’ అంది నేహ.
సిద్ధు జొన్నలగడ్డ, రామ్ చరణ్‌ల నటన అంటే ఇష్టపడుతుంది.
చీరలంటే మహా ఇష్టం. లైట్ వెయిట్, సిల్క్ శారీస్‌లో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
ఫిట్‌గా ఉండేందుకు అరి యోగా చేస్తుంది. ఇదే తన ఫిట్‌నెస్ సీక్రెట్. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తుంది.
నేహ ఇన్‌స్టా ఖాతాకి 14లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
చిత్రలేఖనం అంటే ఇష్టం. ఖాళీ సమయంలో పెయింటింగ్ చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది అని చెప్పింది.
గిటార్ ప్లే చేయడం నేహ హాబీ. మూడ్, సిట్యువేషన్ బాగుంటే మెలొడియస్ ట్యూన్ కట్టడానికీ రెడీ.