హీరామండిలో ఆకట్టుకున్న మన ‘ఏజెంట్‌’ భామ!

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’లో ప్రధాన పాత్రల్లో నటించిన తారలతో పాటు.. మరో భామ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తనే శ్రుతి శర్మ.

ఇందులో కీలక పాత్ర ఆలమ్‌జెబ్‌కి సహాయకురాలు ‘సైమా’ పాత్ర పోషించింది శ్రుతి. ఈమె తెలుగులో నవీన్‌ పొలిశెట్టి నటించిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’లోనూ నటించింది.

‘హీరామండి’లో ఒక రొమాంటిక్‌ సీన్‌ ఉంది. అందులో నటించడం చాలా కష్టంగా అనిపించింది. కానీ, తెరపై అది ఎంతో అందంగా కనిపించిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

చేసింది చిన్న పాత్రే అయినా.. తన నటనతో చిత్రబృందాన్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చాలాకాలంగా సీరియల్స్‌లో నటిస్తోన్న తనకు.. ఈ సిరీస్‌తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది. 

లఖ్‌నవూలో 1994లో జన్మించిన శ్రుతి.. 2018లో‘ఇండియాస్‌ నెక్ట్స్‌ సూపర్‌స్టార్‌’ రియాల్టీ షోలో పాల్గొంది. అందులో ‘థర్డ్‌ సూపర్‌ స్టార్‌’గా నిలిచింది.

అదే ఏడాది యూట్యూబ్‌లో ‘బ్లాక్‌బస్టర్‌ జిందగీ’లో నటించింది. ‘మే హూ తెరా’ అనే మ్యూజిక్‌ వీడియోలోనూ మెరిసింది. ఆ తర్వాత సీరియల్స్‌ ఆఫర్స్‌ వచ్చాయి. 

ఇక 2019లో ‘ఘట్‌బంధన్‌’ సీరియల్‌లో ఐపీఎస్‌ అథికారిణిగా నటించి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు తెలుగులో ‘ఏజెంట్‌ సాయి..’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 

ఆ తర్వాత ‘నజర్‌ 2’, ‘యే జాదూ హై జిన్‌ కా’, ‘నమ్మక్‌ ఇస్కా’ సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులకు చేరువైంది. అందం, అభినయంతో అభిమానుల్ని సంపాదించుకుంది. 

This browser does not support the video element.

బాలీవుడ్‌ సినిమా ‘పగ్లియత్‌’లో, వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

‘ఇండియాస్‌ నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌’లో పాల్గొన్న సమయంలో తనను చాలా మంది అవమానించారట. కానీ, వాటిని సానుకూలంగా

మార్చుకొని ముందుకెళ్లానని తెలిపింది. 

చిన్నతనం నుంచి నటి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఈ క్రమంలోనే నాటకాలు రాయడం, వాటిల్లో నటిస్తూ దర్శకత్వం వహించడం వంటివి నేర్చుకుందట. ఈ బ్యూటీకి భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది.

పెద్దయ్యాక సినిమా అవకాశాల కోసం ముంబయి వెళ్తానంటే తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండేళ్లు సమయం ఇచ్చి నటి అవ్వాలని లేదంటే వెనక్కి వచ్చేయాలని షరతు విధించారట. కానీ, శ్రుతి ఇప్పుడు మంచి నటిగా బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటోంది. 

ప్రస్తుతం ఈ భామ.. అరబిక్‌ ఓటీటీలో ‘అల్‌ బూమ్‌’ టీవీ సిరీస్‌లో నటిస్తోంది. ఇది తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. 

Images/Video:Instagram/Shruti Sharma

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home