రంగులు మార్చే మొబైల్‌.. వివో వీ25 ప్రో!

‘వివో వీ25 ప్రో’ పేరుతో విడుదలైన ఈ మొబైల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో 6.56 అంగుళాల 3డీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది.

Image: Vivo

ఈ మొబైల్‌ వెనుకవైపు ఉన్న రంగులు మార్చే ప్యానెల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Image: Vivo

ఈ 5జీ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను వాడారు. వర్చువల్‌గా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Vivo

వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2ఎంపీ మాక్రో సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందువైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Vivo

66 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,830 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉంది.

Image: Vivo

ఈ మొబైల్‌ సెయిలింగ్‌ బ్లూ, ప్యూర్‌ బ్లాక్‌ రంగుల్లో లభించనుంది. ఆగస్టు 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి.

Image: Vivo

8 జీబీ ర్యామ్‌ / 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 35,999గా ఉండగా.. 12 జీబీ ర్యామ్‌ / 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 39,999.

Image: Vivo

బ్యాంక్‌ ఆఫర్ల కింద రూ. 3,500 వరకు, మొబైల్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ. 3వేల వరకు డిస్కౌంట్‌ లభించనుంది.

Image: Vivo

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home