మోటోరోలా కొత్త 5జీ మొబైల్‌ చూశారా?

త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 5జీ మొబైల్స్‌ రాక జోరందుకుంది. తాజాగా మోటోరోలా మరో 5జీ మొబైల్‌ను విడుదల చేసింది.

Image: Motorola

‘మోటోరోలా జీ62’ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో 6.55 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. రీఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌.

Image: Motorola

క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను అమర్చారు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంది. ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Motorola

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2ఎంపీ మాక్రో సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Motorola

15వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

Image: Motorola

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌ 12 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Motorola

ఇందులో డాల్బీ అట్మాస్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. మిడ్‌నైట్‌ గ్రే.. ఫ్రోస్టెడ్‌ బ్లూ రంగులో మొబైల్‌ లభిస్తుంది.

Image: Motorola

6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 17,999 కాగా.. 8జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999. లాంచ్‌ ఆఫర్‌ కింద బేసిక్‌ వేరియంట్‌ను రూ. 16,499కే విక్రయించనున్నారు.

Image: Motorola

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home