టెక్నో కెమన్‌ 19 ప్రో 5జీ.. ధరెంత? ఫీచర్లేంటి?

టెక్నో సంస్థ కెమన్‌ 19 ప్రో 5జీ మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Tecno

దీంట్లో 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌.

Image: Tecno

మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు మీడియాటెక్‌ హైపర్‌ ఇంజిన్‌ 2.0 మాలి-జీ-57 జీపీయూ అమర్చారు.

Image: Tecno

8జీబీ ర్యామ్‌ ఇచ్చారు. 13 జీబీ వరకు దీన్ని మెమొరీ ఫ్యూజన్‌ ఫీచర్‌తో పెంచుకోవచ్చు.

Image: Tecno

128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

Image: Tecno

వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 2ఎంపీ నానో సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందువైపు 16ఎంపీ సెల్పీ కెమెరా ఉంది.

Image: Tecno

33వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

Image: Tecno

5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Image: Tecno

సెడార్ గ్రీన్, ఎకో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. మొబైల్‌ ధర రూ.21,999.

Image: Tecno

ఈ బుల్లి డివైజ్‌తో మీ పనులు మరింత స్మార్ట్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?

రియల్‌మీలో 12, 12+.. ఫీచర్లు ఇవిగో!

Eenadu.net Home