‘జబర్దస్త్‌’ కొత్త యాంకర్‌..!

ఈ టీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ నుంచి అనసూయ వైదొలగడంతో ఆ షోకి కొత్త యాంకర్‌ వచ్చింది.

Image: Instagram/Sowmya Sharada

తన అందంతోపాటు.. పంచులతో అదరగొడుతున్న ఈమె ఎవరబ్బా అని.. నెట్టింట్లో అన్వేషిస్తున్నారు. 

Image: Instagram/Sowmya Sharada

తనెవరో కాదు.. సీరియల్స్‌ చూసే వాళ్లకి సుపరిచితమే. పేరు సౌమ్య రావ్‌. కన్నడ భామ. అసలు పేరు సౌమ్య శారద.

Image: Instagram/Sowmya Sharada

కర్ణాటకలోని శివమొగ్గలో 1990 సెప్టెంబర్‌ 29న జన్మించింది. బెంగళూరులో చదువు పూర్తి కాగానే ఓ కన్నడ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసింది. 

Image: Instagram/Sowmya Sharada

This browser does not support the video element.

ఆ తర్వాత మోడల్‌గానూ రాణించింది. నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించి..‘పట్టేదారి ప్రతిభ’ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది.

Image: Instagram/Sowmya Sharada 

ఆ సీరియల్‌ హిట్‌ కావడం.. తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో తమిళ టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు వచ్చాయి.

Image: Instagram/Sowmya Sharada

తెలుగులోనూ ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీమంతుడు’ సీరియల్‌లో నటిస్తూ తెలుగు వారికి బాగా దగ్గరైంది. 

Image: Instagram/Sowmya Sharada

This browser does not support the video element.

ఇటీవల ఈటీవీలోనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొన్న సౌమ్య.. కమెడియన్‌ హైపర్‌ఆది, ఆటో రామ్‌ప్రసాద్‌పై వరుస పెట్టి పంచులేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Image: Instagram/Sowmya Sharada

‘జబర్దస్త్‌’కి కొత్త యాంకర్‌ కోసం అన్వేషిస్తున్న షో నిర్వాహకులు సౌమ్య టాలెంట్‌ను గుర్తించి యాంకర్‌గా తీసుకున్నారు. 

Image: Instagram/Sowmya Sharada

అందం, అభినయంతో సీరియల్స్‌లో అదరగొడుతున్న ఈ నటి.. యాంకర్‌గా ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Image: Instagram/Sowmya Sharada

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home