టచ్‌ ఫీచర్‌తో ఆసుస్‌ వివోబుక్‌ 14!

ఆసుస్‌ తాజాగా వివోబుక్‌ సిరీస్‌లో టచ్‌ ఫీచర్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది.

Image: Asus

వివోబుక్‌ 14(X1402) టచ్‌ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ఐపీఎస్‌ టచ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌ ఉంది.

Image: Asus

ఇందులో ఇంటెల్‌ కోర్‌ ఐ5-1240పీ ప్రాసెసర్‌ను వాడారు. ఇంటెల్‌ ఐరిస్‌ Xe గ్రాఫిక్‌ కార్డు ఉంది.

Image: Asus

16 జీబీ ర్యామ్‌.. 512 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image: Asus

ఫుల్‌సైజ్‌ బ్యాక్‌లిట్‌ కీబోర్డు ఉంది. బయోమెట్రిక్‌ ఆంథెటికేషన్‌ కోసం ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ అమర్చారు.

Image: Asus

ఇందులో 42Wh బ్యాటరీ ఉంది. 65 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Asus

దీనికి ఒక యూఎస్‌బీ 2.0 టైప్‌ ఏ పోర్ట్‌, 3.2 జెన్‌ 1 టైప్‌ సీ పోర్ట్‌, రెండు 3.2 జెన్‌ 1 టైప్‌ ఏ పోర్ట్‌లు, ఒక హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్‌, 3.5 ఎం.ఎం ఆడియో జాక్‌ ఉన్నాయి.

Image: Asus

ఈ ల్యాపీ.. ధర రూ. 47,990.

Image: Asus

గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

వీటితో డిజిటల్‌ అరెస్టుకు చెక్‌!

వివో ₹1.60 లక్షల ఫోన్ విశేషాలివీ..

Eenadu.net Home