నోకియా నుంచి సరికొత్త మొబైల్స్.. ట్యాబ్!
ఇటీవల ఫీచర్ ఫోన్స్ విడుదల చేసిన నోకియా తాజాగా రెండు 5జీ ఫోన్లతోపాటు మరో 4జీ మొబైల్, ట్యాబ్‌ను విడుదల చేసింది. వాటి వివరాలివిగో...
Image: Nokia
నోకియా X30 5జీ
మొబైల్‌లో 6.43 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 50 + 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఈ మొబైల్ లభించనుంది.
Image: Nokia
ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ 5జీ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను వాడారు. 33వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4,200ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ రంగుల్లో లభించే ఈ మొబైల్ ధర రూ. 42వేలు ఉంటుందని అంచనా.
Image: Nokia
నోకియా G60 5జీ
ఇందులో 6.58 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. వెనుకవైపు 50+5+2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4జీబీ/128జీబీ, 6జీబీ/128 జీబీ వేరియంట్లలో ఈ మొబైల్ లభిస్తుంది.
Image: Nokia
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉపయోగించారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్యూర్ బ్లాక్, ఐస్ గ్రే రంగులో లభించే ఈ మొబైల్ ధర రూ. 25వేల నుంచి మొదలవుతుందని అంచనా.
Image: Nokia
నోకియా C31
ఈ 4జీ మొబైల్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంది. వెనుకవైపు 13+2+2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 3జీబీ/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో మొబైల్ లభిస్తుంది.
Image: Nokia
యూనిసాక్ 9863A1 ప్రాసెసర్‌ను వాడారు. 5,050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మింట్ చార్‌కోల్ అండ్ సియాన్ రంగుల్లో లభించే ఈ మొబైల్ ధర రూ. 19వేల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.
Image: Nokia
నోకియా T21
నోకియా T21 ట్యాబ్ 10.4 అంగుళాల 2కె డిస్‌ప్లేతో వస్తోంది. దీంట్లో యూనిసాక్ T612 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు, ముందువైపు 8ఎంపీ కెమెరాలు అమర్చారు.
Image: Nokia
ఇందులో 8,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్లోకి వస్తోంది. దీని ధర రూ. 10వేలు ఉంటుందని తెలుస్తోంది.
Image: Nokia