నోకియా సరికొత్త ఫీచర్‌ ఫోన్‌!

నోకియా 8210 4జీ ఫీచర్‌ ఫోన్‌ తాజాగా మార్కెట్లోకి వచ్చేసింది.

Image: Nokia

ఇందులో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఉంది.

Image: Nokia

ఎస్‌ 30 ప్లస్‌ ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో యూనిసాక్‌ టీ107 ప్రాసెసర్‌ వాడారు.

Image: Nokia

48 ఎంబీ ర్యామ్‌ ఇచ్చారు. 128 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉండగా.. దాన్ని ఎస్డీ కార్డుతో 32 జీబీకి పెంచుకోవచ్చు.

Image: Nokia

ఈ ఫీచర్‌ ఫోన్‌లో వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది.

Image: Nokia

1,450ఎంఏహెచ్‌ రిమూవబుల్‌ బ్యాటరీ ఇచ్చారు. 6 గంటల టాక్‌ టైమ్‌, 27 రోజుల వరకు స్టాండ్‌ బై టైమ్‌ ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Image: Nokia

13.8ఎంఎం X 131.3ఎంఎం X 56.2ఎంఎం కొలతలున్న ఈ మొబైల్‌ 107 గ్రాముల బరువు ఉంటుంది.

Image: Nokia

బ్రౌన్‌, బ్లూ, రెడ్‌ రంగుల్లో లభించనుంది. ధర రూ. 3,999.

Image: Nokia

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 12 ప్రో.. వివరాలివీ!

బడ్జెట్‌ ధరలో ఒప్పో కొత్త మొబైల్‌!

బడ్జెట్‌ ధరలో మోటోరోలా మొబైల్స్‌ ఇవీ!

Eenadu.net Home