నోకియా నుంచి ఫ్లిప్‌ మొబైల్‌.. ధరెంతంటే?

నోకియా సంస్థ తాజాగా ఫ్లిప్‌ మోడల్‌ మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Nokia

నోకియా 2660 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో 2.8 అంగుళాల ప్రైమరీ స్క్రీన్‌, 1.77 అంగుళాల సెకండరీ స్క్రీన్‌ ఉన్నాయి.

Image: Nokia

ఇందులో యూనిసాక్‌ టీ107 ప్రాసెసర్‌ వాడారు. వెనుకవైపు 0.3 ఎంపీ కెమెరాతోపాటు ఫ్లాష్‌లైట్‌ ఇచ్చారు.

Image: Nokia

మొబైల్ 48 ఎంబీ ర్యామ్‌, 128 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తోంది. ఎస్డీ కార్డుతో స్టోరేజ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.

Image: Nokia

బ్యాటరీ విషయానికొస్తే.. 1,450ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 6.3 గంటల టాక్‌టైమ్‌, 20.1 రోజుల స్టాండ్‌బై టైం ఉంటుందట.

Image: Nokia

దీంట్లో ఒక ఎమర్జెన్సీ బటన్‌ ఉంటుంది. దాన్ని నొక్కితే ఒకేసారి ఐదు కాంటాక్ట్స్‌కు సమాచారం అందించొచ్చు.

Image: Nokia

మైక్రో యూఎస్‌బీ, 3.5ఎంఎం ఆడియో పోర్ట్‌, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో ఉన్న ఈ మొబైల్‌ 4జీ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. ఇందులో మ్యూజిక్‌ ప్లేయర్‌, ఎనిమిది గేమ్స్‌ ప్రీఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి.

Image: Nokia

నలుపు, ఎరుపు, నీలం రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Image: Nokia

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home