శాంసంగ్‌ నుంచి రెండు సరికొత్త మడత ఫోన్లు..

శాంసంగ్‌ జెడ్‌ సిరీస్‌లో మరో రెండు సరికొత్త మడత ఫోన్లు విడుదల అయ్యాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 పేరుతో శాంసంగ్‌ వీటిని తీసుకొచ్చింది.

Image: Samsung

గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 


ఇందులో మొబైల్‌ను అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు 7.6 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2 ఎక్స్‌ మెయిన్‌ డిస్‌ప్లే, మొబైల్‌ను ఫోల్డ్‌ చేసినప్పుడు 6.2 అంగుళాల కవర్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఉంటుంది. రిఫ్రెష్‌ రేట్‌ 120హెర్జ్‌.

Image: Samsung

అన్‌ఫోల్డ్‌లో మొబైల్‌ సైజ్‌ 130.1/155.1/6.5ఎంఎంగా ఉంది. బరువు.. 263 గ్రాములు.

Image: Samsung

ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 ప్లస్‌ జెన్‌ 1 ప్రాసెసర్‌ను వాడారు. రెండు నానో సిమ్స్‌, ఒక ఈ-సిమ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Samsung

వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సర్‌, 10 ఎంపీ టెలీఫొటో సెన్సర్‌ కెమెరాలున్నాయి. 10ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 4ఎంపీ అండర్‌ డిస్‌ప్లే కెమెరా ఇచ్చారు.

Image: Samsung

25వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే 4,400ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సౌకర్యం కూడా ఉంది.

Image: Samsung

ఈ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ/512 జీబీ, 12 జీబీ/1టీబీ వేరియంట్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.1,42,000 ఉంటుందని అంచనా. ఈ మొబైల్‌కు పెన్‌ కూడా వస్తుంది.

Image: Samsung

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 


ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్ 2 ఎక్స్‌ డిస్‌ప్లే అమర్చారు. ఫోన్‌ను మూసినప్పుడు టైమ్‌, నోటిఫికేషన్లు కనిపించేలా వెనుకవైపు 1.9 అంగుళాల అమోలెడ్‌ కవర్‌ స్క్రీన్‌ కూడా ఉంది.

Image: Samsung

మొబైల్‌ సైజ్‌ ఫోల్డ్‌ చేసినప్పుడు మొబైల్‌ 71.9/84.9/17.1 ఎంఎం, అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు 71.9/165.2/6.9ఎంఎం ఉంటుంది. బరువు.. 187 గ్రాములు.

Image: Samsung

ఇందులో స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ని ఉపయోగించారు. ఒక నానో సిమ్‌, ఒక ఈ-సిమ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Samsung

వెనక వైపు 12ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా ఉంది. ముందుభాగంలో 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. కవర్‌ స్క్రీన్‌తో వెనుకవైపు కెమెరా నుంచి కూడా సెల్ఫీ తీసుకోవచ్చు.

Image: Samsung

3,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Image: Samsung

8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/256 జీబీ, 8 జీబీ/512 జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ధర రూ.80,000 వరకు ఉంటుందని అంచనా.

Image: Samsung

ఈ ఫోన్ల అమ్మకాలు ఆగస్టు 26 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ప్రారంభంకానున్నాయి.

Image: Samsung

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home