కొత్త ఏడాదిలో ఈ మార్పులకు శ్రీకారం చూడదామా?
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. కొత్త ఆశలతో, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కాలంలో మార్పు వచ్చినట్లే.. మనలోనూ మార్పు రావాలి. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలి. ఎలాగంటారా?
Image: RKC
తాతముత్తాతలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు చిరుధాన్యాల(మిల్లెట్స్)ను ఆహారంగా తీసుకోవడం ముఖ్య కారణం. మన ఆరోగ్యమూ బాగుండాలంటే.. రోజులో ఓ పూటయినా చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Image: RKC
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. శరీరానికి వ్యాయామం లేక మనుషులు ఊబకాయులుగా మారుతున్నారు. ఈ రెండింటికి చక్కటి పరిష్కారం సైకిల్. తక్కువ దూరం ఉండే గమ్యానికి, చిన్న చిన్న అవసరాలకు సైకిల్‌ను ఉపయోగించండి.
Image: RKC
పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంత హానికరమో అందరికీ తెలుసు. అయినా విరివిగా వాడేస్తున్నారు. ఇకనైనా ప్లాస్టిక్ సంచులను వాడటం మానేయాలి. దుకాణాలకు వెళ్లేటప్పుడే వస్త్రంతో చేసిన సంచిని తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి.
Image: RKC
ఇంట్లో, ఆఫీసులో గంటల తరబడి కూర్చొనే ఉండటంతో బద్ధకం పెరిగిపోతోంది. కొత్త ఏడాదిలో దీన్ని పోగొట్టుకోవాలి. ఇందుకు ప్రతి రోజు కనీసం గంటయినా వ్యాయామం చేయాలి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
Image: RKC
మొబైల్, సోషల్‌మీడియాను మనం ఎక్కువగా వాడుతున్నాం. దీని వల్ల సమయం వృథా అవుతుంది. కాబట్టి.. అవసరం మేరకే వాటిని వాడటం అలవాటు చేసుకోవాలి. ‘మొబైల్ టైమ్’ను వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
Image: RKC
తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతున్నాయి. దీంతో నిరుద్యోగుల జీవితాలు మార్చే ఏడాదిగా ‘2023’ నిలవనుంది. ఉద్యోగమే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా పరీక్షలకు సిద్ధమవుతే కొలువు సాధించగలుగుతారు.
Image: RKC
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. క్రమంగా ఇది.. కుంగుబాటుకు దారితీయొచ్చు. కాబట్టి ఒత్తిళ్లను దూరం చేసుకునేందుకు ప్రతి రోజు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
Image: RKC
టెక్నాలజీ వేగంగా మారిపోతోంది. దానికి అనుగుణంగా మనమూ మారాలి. డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ టెక్నాలజీపై, సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలి.
Image: RKC