షావోమీ నోట్‌బుక్‌ ప్రో 120జీ.. ఫీచర్లేంటి? ధరెంత?

షావోమీ కొత్తగా నోట్‌బుక్‌ ప్రో 120జీ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: xiaomi

దీంట్లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 14 అంగుళాల 2.5K(2560 X 1600) రిజల్యూషన్‌తో డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: xiaomi

ప్రాసెసర్‌ విషయానికొస్తే.. 12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ i5 12450H ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు MX550 జీపీయూ ఇచ్చారు.

Image: xiaomi

ఇందులో 16 జీబీ ర్యామ్‌ ఇచ్చారు. 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంటుంది.

Image: xiaomi

టైప్‌-సి ఛార్జర్‌తో 56Whr బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 35 నిమిషాల్లో బ్యాటరీ 50శాతం ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.

Image: xiaomi

టైప్‌-సి యూఎస్‌బీ, థండర్‌బోల్ట్‌ 4, టైప్‌-ఎ యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, కాంబో ఆడియో జాక్‌ ఉన్నాయి.

Image: xiaomi

వైఫై 6, బ్లూటూత్‌ 5.2 వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఉంది. 720పిక్సెల్ హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ ఇచ్చారు. పవర్‌ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ అమర్చారు.

Image: xiaomi

సిల్వర్‌ రంగులో లభించే ఈ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. ధర రూ. 74,999. సెప్టెంబర్‌ 20 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

Image: xiaomi

భారత మార్కెట్లోకి వన్‌ ప్లస్‌ నార్డ్‌ N20 SE

ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకోకండి!

ఫోన్‌ పోయిందా? డిజిటల్ యాప్స్‌ను బ్లాక్‌ చేశారా?

Eenadu.net Home