₹10వేలకే లావా 5జీ మొబైల్‌!

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లావా.. అతి తక్కువ ధరకే 5జీ మొబైల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

Image: Lava

‘లావా బ్లేజ్‌ 5జీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఉంది. 

Image: Lava

ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను వాడారు.

Image: Lava

వెనుకవైపు 50 ఎంపీ కెమెరాతోపాటు మరో రెండు సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 

Image: Lava

దీంట్లో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంది. మరో 3 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 

Image: Lava

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. స్టాండ్‌బైలో 588 గంటలు ఉంటుందని సంస్థ చెబుతోంది. 

Image: Lava

సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లున్నాయి. 

Image: Lava

గ్లాస్‌ గ్రీన్‌, గ్లాస్‌ బ్లూ వేరియంట్లలో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 9,999. త్వరలో అమెజాన్‌లో విక్రయాలు మొదలుకానున్నాయి.

Image: Lava

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home