శాంసంగ్‌ నుంచి మరో రెండు కొత్త మొబైల్స్‌!

శాంసంగ్‌ గెలాక్సీ ఏ సిరీస్‌లో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. వాటి వివరాలివిగో..

Image: Samsung

శాంసంగ్‌ గెలాక్సీ A04

దీంట్లో 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. మీడియాటెక్‌ హీలియో పీ35 ప్రాసెసర్‌ వాడారు. 4 జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వెసులుబాటు ఉంది.

Image: Samsung

వెనుక వైపు 50 + 2 ఎంపీ కెమెరాలు, ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Image: Samsung

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత వన్‌ యూఐ కోర్‌ 4.1 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Samsung

4 జీబీ/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 11,999 కాగా.. 4 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 12,999గా ఉంది. గ్రీన్‌, కాపర్‌, బ్లాక్‌, వైట్‌ రంగుల్లో మొబైల్‌ లభిస్తోంది. 

Image: Samsung

శాంసంగ్‌ గెలాక్సీ A04e

ఈ మొబైల్‌ కూడా 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతోనే వస్తుంది. మీడియా టెక్‌ హీలియో పీ 35 ప్రాసెసర్‌నే వాడారు. 

Image: Samsung

వెనుకవైపు 13 + 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 

Image: Samsung

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత వన్‌ యూఐ కోర్‌ 4.1 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Samsung

3జీబీ/32 జీబీ వేరియంట్‌ ధర రూ. 9,299.. 3జీబీ/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 9,999.. 4 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 11,499. లైట్‌ బ్లూ, కాపర్‌, బ్లాక్‌ రంగుల్లో మొబైల్‌ అందుబాటులో ఉంది. 

Image: Samsung

శాంసంగ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌తోపాటు ప్రముఖ ఈ-కామర్స్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లోనూ మొబైల్‌ను విక్రయిస్తున్నారు. 

Image: Samsung

IRCTC లాగిన్‌ వివరాలు మర్చిపోయారా?

అంతరిక్ష కేంద్రం.. ఆసక్తికర విషయాలు

గూగుల్‌ వాలెట్‌ ఎలా వాడాలి?

Eenadu.net Home