కొత్త ఏడాదిని ఎవరు.. ఎప్పుడు జరుపుకొంటారో తెలుసా..?

అందరికీ జనవరి 1 నూతన సంవత్సరంగా జరుపుకోవడం తెలుసు.. కానీ కొన్ని ప్రాంతాలు, దేశాల్లో వారి సంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అదెప్పుడో చూద్దామా..

image:RKC

జనవరి 1ని క్రిస్టియన్లు కొత్త ఏడాదిగా చెబుతారు. గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 

image:RKC

తమిళనాడు వ్యాప్తంగా జనవరి 14ను తమిళ సంవత్సరాదిగా అధికారికంగా చేపడుతారు. రైతుల దినోత్సవంగానూ పాటిస్తారు.

image:RKC

జనవరి 21న చైనాలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. ఇదే రోజు వియత్నాంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

image:RKC

జనవరి - మార్చి మధ్యలో టిబెటన్‌ న్యూ ఇయర్‌ మొదలవుతుంది.

image:RKC

మార్చి 20 లేదా 21న ఇరానీయన్‌ న్యూ ఇయర్‌ను ఘనంగా నిర్వహిస్తారు. దీనిని నోరౌజ్‌గా పిలుస్తారు.

image:RKC

ఉగాది పండుగ రోజు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ ఏడాది మొత్తం ఎలా ఉండబోతుందో పండితులు పంచాంగం కూడా చెబుతారు.

image:RKC

థాయ్‌, శ్రీలంక ప్రజలు ఏప్రిల్‌ 13న కొత్త ఏడాది వేడుకలు జరుపుకొంటారు. కంబోడియన్లకు కూడా ఇదే రోజు కొత్త సంవత్సరం మొదలవుతుంది.

image:RKC

ఏప్రిల్‌ 14న పంజాబీలు కొత్త ఏడాది వేడుకలు చేసుకుంటారు. పంట నూర్పిడి సంబరాలు జరుపుకొంటారు.

image:RKC

అక్టోబరు, నవంబరు నెలల్లో గుజరాతీయులు, బెంగాళీయులు కొత్త ఏడాది ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తారు.

image:RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home