దేశంలో సంక్రాంతి.. ఒక్కో చోట ఒక్కోలా...!
సంక్రాంతి పండుగను జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఉత్తర, దక్షిణ భారత దేశ ప్రజలు భిన్న రీతుల్లో నిర్వహిస్తారు. అక్కడి సంప్రదాయాలు, సంస్కృతి ఆధారంగా పండుగలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 14 నుంచి 17 దాకా ఈ పండుగ చేస్తారు.
image:RKC
దక్షిణ భారత దేశంలో మూడు రోజులు ఈ పండుగను చేసుకుంటారు. తొలి రోజునే భోగి మంటలు వేస్తారు. ఆ రోజు చిన్నారులకు రేగుపళ్లతో(భోగి) స్నానం చేయిస్తారు. భోగి ముగ్గులు, ఆవుపేడలతో గొబ్బెమ్మలను తయారు చేసి ముంగిళ్లలో పెడుతారు. కొత్త దుస్తులు ధరించి పతంగులను ఎగరేస్తారు.
image:RKC
ఈ భోగిని పంజాబ్‌లో లోహిడి ఉత్సవంగా నిర్వహిస్తారు. అక్కడ కూడా చిన్నారులకు రేగుపళ్లతో స్నానం చేయిస్తారు. అస్సాంలో భోగలే బిహుగా భోగిని చేసుకుంటారు. గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికి వచ్చి కొత్త బియ్యం, వస్త్రాలు, కొంత నగదును స్వీకరిస్తారు.
image:RKC
సంక్రాంతి రోజున పిండి వంటలను తయారు చేస్తారు. పితృదేవతలకు ఆహారాన్ని నైవేద్యంగా పెడుతారు. కొత్త బియ్యంతో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో పరమాన్నం తయారు చేస్తారు. సూర్యునికి సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆరగిస్తారు.
image:RKC
ఈ పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు, ఎద్దు పందేరాలు నిర్వహిస్తారు. కొన్నిసార్లు బండలెత్తడం, కుస్తీ పోటీలు ఏర్పాటు చేస్తారు. తమిళనాడులో పశువులతో జల్లికట్టు పోటీలుంటాయి.
image:RKC
కేరళలో మకర సంక్రాంతికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు అయ్యప్ప మకరజ్యోతిగా దర్శనమిస్తాడట. మహారాష్ట్రలో నువ్వులు, బెల్లం కలిపిన వంటకాలతో పాటు నల్లని దుస్తులు ధరిస్తారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నువ్వులతో జొన్నరొట్టెలను తయారు చేసి తింటారు.
image:RKC
బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో ఖిచిడీ సంక్రాంతిగా పిలుస్తారు. రకరకాల కాయకూరలు, కంది, పెసర పప్పు,బియ్యం కలిపి ఖిచిడీ తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతారు.
image:RKC
దక్షిణాదిలో కనుమ రోజు పశువులను శుభ్రం చేసి పొలాల్లో నాగలి సాలు పట్టిన తర్వాత వాటిని పూజిస్తారు. చాలా ప్రాంతాల్లో కర్రీ(మాంసాహారం) పండుగగా పిలుస్తారు.
image:RKC
కనుమను ఛత్తీస్‌ఘడ్‌లో చేరాచేరి పండుగగా చేసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు ఇళ్లకు వచ్చి పచ్చి బియ్యం, పండ్లు, డబ్బు దానం చేస్తారు. గుజరాత్‌లో మనలాగే గాలిపటాలను ఎగురవేస్తారు.
image:RKC
కొన్ని రాష్ట్రాల్లో ముక్కనుమగా నిర్వహిస్తారు. ఆ రోజున తిరునాళ్లు, పగబండ్లు కడుతారు. పలుచోట్ల జాతరలు జరుగుతాయి. ఉత్తర భారత దేశంలోని ప్రజలు నదీస్నానం ఆచరిస్తారు.
image:RKC