చిత్రం చెప్పే విశేషాలు

(01-03-2025)

రాజమహేంద్రవరం అఖండ గోదావరి నదిపై పడవల పోటీలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి.

విజయనగర సామాజ్య్ర వైభవాన్ని గుర్తుచేసే హంపీ ఉత్సవాలకు శుక్రవారం తెరతీశారు. అలరిస్తున్న మత్స్యశాఖ స్టాల్‌ అందరినీ అలరించింది.

ఆకాశంలో శుక్రవారం అరుదైన వింత చోటుచేసుకుంది. శుక్ర, గురు, కుజ గ్రహాలు ఒకే వరుసలో దర్శనమిచ్చి చూపరులను అలరించాయి.

సంతనూతలపాడు : ఆటపాటలు.. నృత్యాలు.. సాంకేతిక, సాంస్కృతిక ప్రదర్శనలు.. పలు విభాగాల్లో పోటీలు.. చూపరుల కేరింతల మధ్య ఆర్నేట్- 25 ఉత్సవం సందడిగా సాగుతోంది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని శ్రీభవానీ విద్యానికేతన్‌ ఆవరణలో చెట్టుకు గుమ్మడికాయ ఆకారంలో బొప్పాయి కాసింది.

విజయనగర సామాజ్య్ర వైభవాన్ని గుర్తుచేసే హంపీ ఉత్సవాలు పుచ్చకాయలపై చెక్కిన కవులు, విద్వాంసులు, ప్రముఖుల చిత్రాలు.

ఒంగోలు ప్రభుత్వ వైద్యకళాశాల 2019 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. 

హొసపేటె: నులితాడుతో సిద్ధమైన ఏనుగు బొమ్మ అందరినీ అలరించింది.

మదనపల్లె పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం మహా కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద శుక్రవారం ఫీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ ఇండియా (పెటా) ఆధ్వర్యంలో శుక్రవారం చేపల భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home