#eenadu

పాయకరావుపేట: కొబ్బరి చెట్టు సహజంగా పొడవుగా, కొన్ని చోట్ల వాలుగా ఎదుగుతుంది. ఈ చెట్టు మెలికలు తిరిగి అనకొండను తలపిస్తోంది.

కంది నుంచి శంకర్‌పల్లి పైపునకు ఓ భారీ యంత్రాన్ని లారీపై తీసుకెళ్లారు. చాలా సేపు కంది శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచడంతో ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులు ఇబ్బందిపడ్డారు. 

ఉత్కళ (ఒడిశా) దివస్‌ సందర్భంగా మీనాక్షినగర్‌లోని సెయింట్‌ జేవియర్స్‌ ఉన్నత పాఠశాల స్కౌట్, గైడ్స్‌ విద్యార్థులు స్ట్రాలతో ఉత్కళ గౌరవ్‌ మధుసూదన్‌ దాస్‌ ఆకృతిని తీర్చిదిద్దారు. 

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీలు, మల్లెలతో పుష్పార్చన రుత్వికులు సోమవారం నిర్వహించారు. 

మామిడికుదురు : పచ్చని వరిచేలు కంకులతో కళకళలాడుతూ.. పక్కనే ఆరబోసిన ధాన్యం పసుపు వర్ణంతో మెరిసిపోతూ.. చుట్టూ కొబ్బరిచెట్ల మధ్య ఎంతో ఇంపుగా మామిడికుదురులోని జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యమిది. 

కూచిపూడి: విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా కూచిపూడిలో సోమవారం నాట్యోత్సవాన్ని రసరమ్యంగా ప్రదర్శించారు.  

హైదరాబాద్‌: బూడిద రంగు దేహం.. పొడవాటి తోక.. కొమ్ములా పదునైన ముక్కు.. ఈ పక్షులను ‘ఇండియన్‌ హార్న్‌ బిల్స్‌’ అంటారు.  

పవిత్ర రంజాన్‌ మాసం ముగిసిన సందర్భంగా సోమవారం కర్నూలులోని సంతోష్‌నగర్‌ వద్ద ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు 

కొడంగల్‌లోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం స్వామి హనుమత్‌ వాహన సేవోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(03-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(03-04-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(02-04-2025)

Eenadu.net Home