చిత్రం చెప్పేవిశేషాలు
(02-01-2025)
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సస్యకాశి లాల్‌బాగ్‌లో జనవరి 16 నుంచి 26 వరకు ఫలపుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని ఉద్యానశాఖ అధికారులు ప్రకటించారు.
నూతన సంవత్సర తొలినాడైన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ అయోధ్య, వారణాసి క్షేత్రాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సచివాలయం, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్కు పరిసరాలు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడ్డారు.
ఏపీలోని గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 400 పెంపకం కేంద్రాలున్నాయి.
తుర్కియేలోని ఇస్తాంబుల్ నగరంలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా బుధవారం ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలు.
వీపు భాగం నుంచి తల, ముక్కు చివరి వరకు బూడిద రంగులోనూ.. ఉదర భాగం, తోక చివర పసుపు, నలుపు వర్ణాలు మిళితమై చూపరులను ఆకట్టుకునే కొల్లేరు అందాల అతిథి గ్రే వాగ్‌టైల్.
మహా కుంభమేళాను పురస్కరించుకొని బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక ఊరేగింపు నిర్వహిస్తున్న సాధువులు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లారా మీదుగా మహారాష్ట్ర వెళ్లే జాతీయ రహదారి-44 బుధవారం ఇలా దట్టంగా పొగమంచుతో నిండిపోయింది.