#eenadu
తిరుపతి: ఎండ తీవ్రత నుంచి రక్షణగా ఓ ఉపాధ్యాయిని వట్టి వేర్లు, కొబ్బరి పీచుతో చేసిన టోపీ ధరించి తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం ఎదుట కనిపించారు.
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల పదో తరగతి విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలకు పదునుపెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు.
గోదావరి స్నాన ఘట్టాల వద్ద మంగళవారం రాత్రి గోటి తలంబ్రాలకు కోటి దీపోత్సవం అట్టహాసంగా నిర్వహించారు.
రంజాన్ పండగ ముగిసిన సందర్భంగా సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానాలు చేయటానికి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ముస్లింలు మంగళవారం తరలివచ్చారు.
పెరుగుతున్న ఎండలతో జనాలు ఇబ్బంది పడుతున్నట్లే.. జలచరాలూ అల్లాడిపోతున్నాయి. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఎండకు పంట కాలువలోని నీరు వేడెక్కడంతో తాబేళ్లు రాయిపైకి వచ్చాయి.
గండేపల్లి: జింబాబ్వే నుంచి సద్దా, క్యాబేజి, పశ్చిమ్‌బంగ నుంచి సందేశ్, రసమలై, మణిపూర్ పుంచి సింజు, బంగ్లాదేష్ నుంచి రసగుల్లా, ఏపీ నుంచి ఉగాది పచ్చడి వంటకాలను విద్యార్థినులు తయారు చేశారన్నారు.
ఉప్పాడ చేపలరేవు నుంచి మంగళవారం వేటకెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు భారీ నల్లమట్ట చేప చిక్కింది.
ఐస్‌లాండ్‌లోని రేక్ జానెస్ ద్వీపకల్పం గ్రిండావిక్ పట్టణం సమీపంలో అగ్నిపర్వతం విస్ఫోటం అనంతరం ప్రవహిస్తున్న లావా.