చిత్రం చెప్పేవిశేషాలు

(03-01-2025)

ఒకే చోట ఉంటే గిరాకీ రావడం లేదని గ్రహించి వినూత్నంగా ఆలోచించారు.. ఆ టైలర్‌. ఏకంగా మొబైల్‌ టైలరింగ్‌తో ప్రజల ముందుకు వెళ్తున్నారు.

 గీతలను చక్కని ఆకృతిలో గీస్తే ఓ బొమ్మవుతుంది. గీతల బదులు ‘శ్రీరామ’ అనే అక్షరాలను రాస్తూ దేవుడి బొమ్మను వేస్తే.. రామకోటి కూడా రాసినట్లవుతుంది. 

మోపిదేవి గ్రామానికి చెందిన బొందలపాటి వెంకటేశ్వరప్రసాద్‌ తన పెరట్లో నాటిన కందను గురువారం తవ్వారు. దాన్ని కాటా వేయగా 15.2 కిలోల బరువు గల ఒకే దుంప వచ్చింది. 

నౌకాదళ దినోత్సవం-2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం (4వ తేదీన) విశాఖ సాగర తీరంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. 

మహిళల హక్కుల కోసం విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫులే జయంతి సందర్భంగా గురువారం నారాయణఖేడ్‌కు చెందిన పత్రచిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకుపై ఆమె చిత్రాన్ని మలిచారు.

మహారాష్ట్ర నుంచి తొలివిడత అయిదు ఎలక్ట్రిక్‌ ‘డబుల్‌ డెక్కర్‌’ బస్సులు తెప్పిస్తోంది. బస్సుపై ఒడిశా కళలు, సంస్కృతి ప్రతిబింబించే చిత్రాలున్నాయి.

మనాలిలోని సోలంగ్‌ వ్యాలీలో గురువారం మంచు దుప్పటి కప్పేసింది. దీంతో పర్యటకులు భారీగా తరలి వచ్చి సందడి చేశారు.

 ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో గురువారం ఛావనీ ప్రవేశ్‌ 

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మహానిర్వాణి అఖాడాకు చెందిన సాధువులు

ఉస్మానియా యూనివర్సిటీలోని బొటానికల్‌ గార్డెన్స్‌లో ముచ్చటించుకుంటున్నట్లు జావా పిచ్చుకలు కనిపించాయి. వీటిని లక్కీ బర్డ్స్‌ అని కూడా అంటారు. 

నగరంలోని ముత్తుకూరు-కృష్ణపట్నం జాతీయ రహదారి వంతెన కింద గోడలకు అందమైన చిత్రాలు అటుగా వెళ్లేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(07-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(06-01-2025)

Eenadu.net Home