#eenadu
భువనగిరి పట్టణ శివారులోని ఓ రైతుకు చెందిన ఆమేయ కృషి వికాస కేంద్రంలో మామిడి కాయ 2.854 కిలోల బరువుతో కాసింది.
చిత్రంలో కనిపిస్తున్న యువకుడి పేరు రోహిత్. ఇతనిది బిహార్ రాష్ట్రం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఏటా సైకిల్‌పై పుణ్యక్షేత్రాలను చుట్టి వస్తుంటారు.
ఇక్కడ కనిపిస్తున్నది బొప్పాయి పండు అనుకుంటే పొరబడినట్టే. బొప్పాయి ఆకారంలో ఉన్న ఓ టమాటా వచ్చింది. అచ్చం బొప్పాయిలా ఉండటంతో.. దుకాణానికి వచ్చిన వారు దీనిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు.
#eenadu
బుద్ధిమాంద్యం (ఆటిజం) గురించి ప్రపంచంలో అవగాహన పెంచడానికి 15 ఏళ్ల నైజీరియన్ బాలుడు కాన్యెయాచుక్వు టాగ్బో 12,304 చదరపు మీటర్ల కాన్వాస్‌పై చిత్రపటాన్ని రచించి గిన్నిస్ రికార్డు సాధించాడు.
ఈ చిత్రంలో కనిపిస్తుంది నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికాభివృద్ధి వైపు ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వీటిని ఏర్పాటు చేయించింది.
మాసబ్‌ట్యాంక్ పరిసరాల్లో వంతెన కింది పిల్లర్లను అనేక చిత్రాలతో తీర్చిదిద్దారు. వేలాది పచ్చని మొక్కలు నాటారు. మాసబ్‌ట్యాక్ వంతెన కింద మొగ్గలు, పూలు, ఆకుల ఆకృతులతో రెండు ఫౌంటెయిన్లు నిర్మించారు.
ఇల్లు, ఆవరణంతా పచ్చదనంతో నిండి ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో కళకళలాడుతున్న ఈ నివాసం పేరు ‘పొదరిల్లు’. ఇది జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 38లో ఉంది.