చిత్రం చెప్పేవిశేషాలు

(04-01-2025)

సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ‘పగల్‌ పత్తు’ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి, అమ్మవార్లను కనుల పండువగా అలంకరించి ఊరేగించారు.

హాయిగా సాగిపోతున్న యువతి జీవితానికి విద్యుదాఘాతం అశనిపాతమైంది. హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లు ఇంటి పక్క నుంచే వెళ్తుండగా చేతిలో ఉన్న స్టీల్‌ పైపు అనుకోకుండా తగిలి విద్యుత్తు ప్రమాదానికి గురై కుడిచేయి కోల్పోవాల్సి వచ్చింది.

అంబాజీపేటలో చిట్టి బండిపై ఓ చిన్నారి సవారీ చేయడం స్థానికులను ఆకట్టుకుంది. 

తుని మండలం ఎస్‌.అన్నవరం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం 150 కిలోల చిత్రాన్నం(పులిహోర), ఎండు ఫలాలతో స్వామి రూపాన్ని చిత్రించారు. 

ధనుర్మాస మహోత్సవంలో భాగంగా రావులపాలెంలోని అలివేలు మంగా పద్మావతి, ఆండాళ్‌ సహిత వేంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్రించిన గోదాదేవి అమ్మవారు.

వక్కపొడి రంగు జూలు కలిగిన పొడవాటి మెడ, వెన్నుపై నీలం, బూడిద వర్ణాలు కలగలిసిన ఆకర్షించే వెంట్రుకలు.. లేత పసుపు, బూడిద, నలుపు రంగుల ముక్కుతో చూపరులను కనువిందు చేసే కొల్లేరు అందాల అతిథి చైనీస్‌ పాండ్‌ హెరాన్‌.

 ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేశారు. వర్షాల నేపథ్యంలో రైతుల నుంచి మోతాదుకు మించి తీసుకున్నారు. దీంతో ఇవి మిల్లుల బయట ఇలా పిరమిడ్‌ ఆకృతిలో ఈ గుట్టలు కనిపిస్తున్నాయి.

గన్నవరం విమానాశ్రయంలో నిర్మించనున్న కొత్త టెర్మినల్‌ నమూనా.

ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో అరుదైన నల్ల చిరుతను అటవీ అధికారులు గుర్తించారు. కూనను నోట కరుచుకుని సంచరిస్తున్న చిరుత చిత్రాలు ఆ ప్రాంతంలో అమర్చిన ట్రాప్‌ కెమెరాలకు చిక్కాయి.

 ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సాలూరులోని పెదకోమటిపేట రామాలయంలో శ్రీరంగనాథస్వామికి శుక్రవారం దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు.

చిత్రం చెప్పేవిశేషాలు(07-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(06-01-2025)

Eenadu.net Home