చిత్రం చెప్పే విశేషాలు
(04-02-2025)
విశాఖపట్నం జీవవైవిధ్య ఉద్యానవనంలో ప్రతి మొక్కా ఓ ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఎయిర్ ప్లాంట్స్ మొక్కా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.
ఆంధ్రా ఊటీ అరకులోయలో దట్టంగా మంచు కురుస్తోంది. తొమ్మిది గంటల తర్వాతే సూర్య కాంతులు ప్రకాశిస్తున్నాయి. దగ్గరకెళ్లి చూస్తే ముత్యాల దండలా దర్శనమిస్తోంది.
వసంత పంచమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సోమవారం ప్రయాగ్రాజ్లోని త్రివేణీసంగమానికి వస్తున్న సాధువులు.
విద్యుద్దీపాల వెలుగులో అరసవల్లి మార్గం.
దిల్లీలో సోమవారం రాష్ట్రపతి భవన్ దివస్-2025 కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గాయకుడు సోనూ నిగమ్ తదితరుల గ్రూప్ ఫొటో.
నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఊర పిచ్చుక ఎండ తీవ్రతకు కిందపడిపోయింది. స్థానికుడు అంజికుమార్ దానికి నీరు తాపి, సపర్యలు చేస్తే అర గంట తర్వాత కోలుకొని తుర్రున ఎగిరిపోయింది.
పాల్వంచ పట్టణం: యాగశాల దర్శన యోగం.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. పెద్దమ్మతల్లి. నిత్యం భక్తులతో కలకలలాడే అమ్మవారి సన్నిధికి అనుబంధంగా.. కొత్తగా శివాలయాన్ని నిర్మిస్తున్నారు.
తాండూరు టౌన్: సరస్వతి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి .
తెనాలి: ఇదేదో ప్రభుత్వం కార్యాలయ భవనంపై వేసిన అందమైన బొమ్మలు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇంటి గోడలపై బొమ్మలు వేయించుకున్నారు.
హిమపాతంతో నిండినట్లు కనిపిస్తున్న ఈ చిత్రం హిమాలయాల్లోని పర్వతాలు అనుకుంటే పొరపాటే.. రెండు మూడు రోజులుగా నల్గొండలో కురుస్తున్న మంచు నీలగిరి కొండలను హిమపాతంతో కప్పేస్తున్నాయి.