చిత్రం చెప్పే విశేషాలు

(04-03-2025)

నగర సుందరీకరణలో భాగంగా మలక్‌పేట రైల్వే వంతెనపై వేసిన మెట్రో రైలు చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. వాహనదారుల పక్క నుంచే పరుగులు పెడుతున్నట్లు చిత్రీకరించారు. 

మెక్సికోకు చెందిన ఈ వ్యక్తి పేరు జువాన్‌ కార్లోస్‌. చిన్నప్పుడు ఏవైతే బొమ్మలు కొనుక్కోవాలని భావించాడో అవన్నీ కొనేసి ఇలా కారుకు అలంకరించుకుని తిరుగుతూ మురిసిపోతున్నాడు.

బాపట్ల: ముగ్గులు అతివలే కాదు.. ఎండ్రకాయలు వేస్తున్నాయి. సూర్యలంక తీరంలో ఇసుకలోపల గూడులను సిద్ధం చేసుకుంటున్నాయి.అవి వివిధ ఆకృతుల్లో ముగ్గులను తలపిస్తున్నాయి. చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

సంపూర్ణ కృష్ణశిలతో పునర్నిర్మితమైన యాదగిరిగుట్ట దేవాలయ విమానం(గోపురం) ఇటీవల పసిడి అందాలను సంతరించుకొని మరింత దేదీప్యమానంగా దర్శనమిస్తోంది.

హాలహర్వి: కర్ణాటక రాష్ట్రం తోరనగల్లుకు చెందిన బ్రహ్మకుమారి సంఘం ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూలతో తయారు చేసి ఆలూరులో ఊరేగించారు. 

హొసపేటె: వినాయకుడి వేషధారణలో నృత్యప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. 

అర్థవీడు: ప్రకృతి వింతలు.. పచ్చందాలకు నల్లమల అటవీ ప్రాంతం నెలవు. ఈ ప్రాంతం పర్యావరణ ప్రేమికులతో పాటు సాహస యాత్రికులను నిత్యం ఆకర్షిస్తుంటుంది. 

ఆరాంఘర్‌లోని రేతిబౌలీ చౌరస్తాలో రహదారి పక్కన నాటిన మొక్కలు పైవంతెన కంటే ఎత్తుగా పెరిగాయి. ఇవి పచ్చదనంతో ఆ మార్గంలో ప్రయాణించే హనదారులను ఆహ్లాదపరుస్తున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home