#eenadu
భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి ఓ ఇంటివాడయ్యాడు. నిధి కటారియాను అతడు వివాహం చేసుకున్నాడు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని ఓ దుకాణంలో హృదయం (లవ్ గుర్తు) ఆకారంలో బంగాళదుంప కనిపించింది. దాన్ని పలువురు ఆసక్తిగా చూశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ ఆకట్టుకునే బంగారు చీరను నేశారు.
రుషికొండ తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న ఆకృతుల ఆకర్షణీయ సాగర కప్పలు చిక్కాయి.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ భావోద్వేగానికి గురైన ప్రవాస భారతీయ మహిళ
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌లో పాకిస్థాన్ నుంచి వచ్చిన అనుమానాస్పద బెలూన్‌ను పరిశీలిస్తున్న సైనికుడు
ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఎక్కువగా కనిపించే గ్రేహెరాన్ అనే జాతి పక్షులు సంతానోత్పత్తిలో భాగంగా మద్దిపాడు మండలం మల్లవరం సమీపంలోని గుండ్లకమ్మ జలాశయం పరిసరాలకు వచ్చాయి.
శ్రీరామనవమి సమీపిస్తుండటంతో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ప్రతిమల విక్రయాలు జోరందుకున్నాయి. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌లో రహదారుల వెంబడి రంగు రంగుల బొమ్మలు ఇలా కనిపించాయి.