చిత్రం చెప్పే విశేషాలు

(05-02-2025)

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా పేరొందిన అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, వంద అడుగుల వెడల్పుతో ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. 

ప్రయాగ్‌రాజ్‌లోని హనుమాన్‌ ఆలయంలో పూజలు చేస్తున్న భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ .

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవం కనులపండువగా నిర్వహించారు.

రథసప్తమి సందర్భంగా కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.

ఒంగోలు రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోని ఆ బోగీలో మాత్రం అలా కుదరదు. నోరూరించే వంటకాలను ఇష్టంగా ఆరగించేందుకు ఆహార ప్రియులు అందులోకి ఎక్కుతుంటారు.

హనుమకొండ నగరం కూడళ్లలో అందంగా ఏర్పాటు చేసిన ఆకృతులు నేడు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. కళారూపాలను పట్టించుకోకపోవడంతో నగర ప్రజలు పెదవి విరుస్తున్నారు.

భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత శ్రీ రాసపోలమాంబ అమ్మవారిని గ్రామస్తులు ఖర్జూరంతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. 

చీకటి పడిందంటే చాలు..మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జగద్గిరిగుట్ట హెచ్‌ఎంటీ జంగిల్‌లో నిత్యం ఈ దృశ్యం కనిపిస్తుంది.

భద్రాచలం - రాజమండ్రి ప్రధాన రహదారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు మల్చింగ్‌ ఏర్పాటు చేసి అందులో పొగాకును సాగుచేశారు.  

బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. ఏలూరు జిల్లా ఆటపాకలోని వలసపక్షుల ఆవాస కేంద్రంలో పెలికాన్‌ పక్షులు తమ పిల్లలకు ప్రేమగా ఆహారాన్ని కొసరి కొసరి తినిపిస్తున్న చిత్రాలివి. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(04-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(04-02-2025)

Eenadu.net Home