చిత్రం చెప్పే విశేషాలు
(05-03-2025)
కంచిలి మండల పరిది జాడుపూడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం పెద్ద ట్యాంకరు వాహనదారులను ఆకట్టుకుంది.
శ్రీకాళహస్తి: జ్ఞానాంబిక అమ్మవారి పల్లకీ, వెనుక సోమస్కందమూర్తి, గంగాదేవిల పల్లకీల రాకతో పట్టణ వీధులన్నీ పులకించిపోయాయి. అలిగి ముందు వెళ్తున్న జ్ఞానాంబికను భక్తులు దర్పణంలో చూసి ప్రణమిల్లారు.
గార మండలం పూసర్లపాడులో మంగళవారం గ్రామదేవత పిఠాపురం అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
రేపల్లె రైల్వేస్టేషన్‌లో మోడు బారిన ఓ దిరిసెన మొద్దు పైభాగంలో నుంచి రావి మొక్కలు పుట్టుకొచ్చాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు వాటిని చూసి ఔరా అంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శ్రీ నాథేశ్వర్ మహాదేవ్ మందిర్‌లో భక్తులు వేసిన తాళాలు ఇవి. తమ కోర్కెలు నెరవేర్చాలని శివుడిని ప్రార్థిస్తూ భక్తులు ఈ ఆలయంలో ఇలా తాళాలు అమర్చుతారు
గోదావరి నీటితో సిద్దిపేట జిల్లా మర్కుక్ సమీపంలోని కొండపోచమ్మ సాగర్ కళకళాడుతోంది.
మంత్రాలయంలో గురువైభవోత్సవాల్లో భాగంగా బెంగళూరుకు చెందిన బృందావన కళానికేతన్ నృత్య కళాశాల నిర్వాహకురాలు శ్రేయా బాలాజీ నేతృత్వంలో ఆమెతోపాటు కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
తిరుపతి - మదనపల్లి మార్గంలో రంగంపేటకు వెళ్లే దారిలో పచ్చని చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి.
యాదగిరి క్షేత్రంలో కొనసాగుతున్న ఆలయ బ్రహ్మోత్సవాలలో మంగళవారం స్వామిని ‘వటపత్ర శయనుడి’గా అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు.
మంత్రాలయం: ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రామనాప జపంతోపాటు భజన కీర్తనలు ఆలపించి ఆకట్టుకున్నారు.