#eenadu
యాదగిరిగుట్ట పంచనారసింహ పుణ్యక్షేత్రం ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సందడిగా మారింది.
సారవకోట మండలంలోని గొర్రిబంద గ్రామంలో తిరుపతిరావుకు చెందిన మామిడి తోటలో ఓ చెట్టుకు కాసిన కాయ వింత ఆకారాన్ని పోలి ఉండటంతో స్థానికులు ఆసక్తిగా చూశారు.
పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు వేసవి వినోదాల్లో మునిగి తేలుతున్నారు. తల్లిదండ్రుల చెంత ఆర్కే బీచ్‌కు వచ్చిన చిన్నారుల ఆనందానికి అవధులే లేవు. రకరకాల విన్యాసాలు, ఆటలతో సందడి చేశారు.
అమలాపురం పట్టణం: హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నేపథ్యగాయకుడు ముఖేష్ శతజయంతి ఉత్సవాలను పురష్కరించుకుని తపాలా శాఖ రూ.30 ముఖవిలువ తపాలా బిళ్లతో కూడిన మినియేచర్ పత్రాన్ని విడుదల చేసింది.
విశాఖపట్నం: సమంత ఆదివారం రాత్రి నగరంలో సందడి చేశారు. బీచ్‌రోడ్ నోవాటెల్ హోటల్ ఎదురుగా జరిగిన శుభం సినిమా ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
సాధారణంగా కర్బూజ పండు అనగానే లోపల ఎరుపు రంగు కనిపిస్తుంది. పలాస రైల్వేకాలనీలో పనులు చేపడుతున్న కాకినాడకు చెందిన గుత్తేదారు సూర్యనారాయణ అక్కడి నుంచి ఓ కర్బూజ పండు తీసుకొచ్చారు. దాన్ని కోసి చూస్తే లోపల పసుపుగా ఉంది.
జల్లూరిమెట్ట :ఆకర్షణీయంగా కనిపించే ఈ పుష్పాన్ని చూసి రాత్రివేళల్లో మాత్రమే వికసించే బ్రహ్మకమలం అనుకుంటే పొరపడినట్లే. ఇది డ్రాగన్ పుష్పం.
సుజనకోట, పనసపుట్టు పంచాయతీల్లో విస్తరించి ఉన్న మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతం ఆహ్లాదకరంగా దర్శనమిస్తోంది.