చిత్రం చెప్పే విశేషాలు
(06-02-2025)
నిండుగా నీటితో కళకళలాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది. సుందిళ్ల బ్యారేజీ వెనుక జలాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్‌బెల్టు వంతెన వద్ద నది నిండుకుండను తలపించేది.
చెర్వుగట్టు గ్రామంలో కొండపైన ఉన్న జడల రామలింగేశ్వర స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం బుధవారం తెల్లవారుజామున కనులపండువగా జరిగింది.
పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో బావిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. స్థానికులు దీనిని ఓ అందమైన జ్ఞాపకంగా మార్చుకున్నారు.
అనంతపురం జిల్లాకు సంబంధించి వ్యవసాయ అనుబంధ విభాగాల్లో కృషి చేసిన స్వచ్ఛంద సంస్థలు, రైతులు సభాప్రాంగణం వద్ద కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
కనుచూపు మేరలో నీరు.. ఆ చివరన నీలాకాశం.. రెండూ కలిసి కాన్వాస్‌లా ఏర్పడితే.. వందల పక్షులు ఎగురుతున్న చిత్రం దానిపై గీస్తే.. ఎలా ఉంటుంది? అది చూడాలంటే కొల్లేరు తీరం వెళ్లాల్సిందే.
నగరం రూపు మారుతోంది. ముత్తుకూరు సెంటర్ మినీ బైపాస్ వంతెన కొత్త కళ సంతరించుకుని.. అటుగా వెళుతున్న వారికి ఆహ్లాదం పంచుతోంది.
రేవుపోలవరం తీరం ప్రకృతి అందాలకు నెలవు. పైన వినీలాకాశం, రాతికొండను ఢీకొడుతూ కనిపించే అలలు, పచ్చటి కొబ్బరితోటలు, వంపు తిరిగిన తీరం..