#eenadu

పేరు గోబీ.. రంగు గులాబీ.. ఈ చిత్రంలో కనిపిస్తున్నవి క్యాలీఫ్లవర్లు(గోబీ).. కాకపోతే గులాబీ రంగులో ఉన్నాయి అంతే. శ్రీకాకుళం నగరంలో వీటిని ఒక్కోటి రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. 

పీత అందం చూడవయ్యా..! సాగర్‌నగర్‌ తీరంలో బుధవారం పసుపు రంగు పీతలు సందడి చేశాయి. అరుదుగా కనిపించే ఇవి సాధారణంగా పగటిపూట సముద్రంలోనే ఉంటాయి. 

కామారెడ్డి పట్టణం : ఇంటి నిర్మాణాలను భిన్నంగా చేపడుతున్నారు. ఆపై డాబాపై నీళ్ల ట్యాంకులను ఆకట్టుకునేలా భిన్న ఆకారాల్లో నిర్మిస్తున్నారు. తాబేలు రూపంలో, పెంకుటిళ్ల మాదిరిగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.  

విశాఖపట్నం: నగరంలో బీచ్‌లకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఇటీవల పెరిగింది. బుధవారం రుషికొండ బీచ్‌ను పలువురు విదేశీయులు సందర్శించారు. 

కాకినాడ తీరంలో బ్రాహ్మినీ పక్షి (హలియాస్టూర్‌ ఇండస్‌) సంచారం కనువిందు చేస్తోంది. తొండంగి మండలంలోని తీరంలో కనిపించిన పక్షులివి.  

 కేరళలోని కొచ్చిన్‌లో ఆలయ వేడుకల కోసం రోబో గజరాజును తరలిస్తున్న సిబ్బంది. ఇటీవల కొన్ని ఉత్సవాల్లో ఏనుగుల బీభత్సం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

చుట్టూ పచ్చని పైర్లు.. మధ్యలో పోచమ్మతల్లి ఆలయం. ఆహ్లాదకరంగా ఉన్న ఈ చిత్రం గోపాల్‌పేట మండలం తాడిపత్రి లక్ష్మీసముద్రం వద్ద కనువిందు చేస్తోంది. 

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణ అంతా పసుపు రంగుతో నిండిపోయింది. మొక్కజొన్న పంటను నేరుగా మార్కెట్కి తెచ్చి ఆవరణలో ఆరబోయడంతో మార్కెట్ ప్రాంతం అంత పసుపువర్ణంలో కనువిందు చేసింది. 

హుజూర్‌నగర్‌ పట్టణ శివారులోని రూపం వింతగా.. జనంలోకి కొత్తగా ఈ వింత పిల్లి గురించి బయటకు తెలియడంతో దాన్ని చూసేందుకు జనం వరుస కట్టారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home