చిత్రం చెప్పే విశేషాలు

(07-03-2025)

విమానాశ్రయం కాదు.. బేగంపేట రైల్వేస్టేషనే.. బేగంపేట రైల్వేస్టేషన్‌ ఆధునిక హంగులతో సిద్ధమవుతోంది. చూడగానే రైల్వేస్టేషనా లేక విమానాశ్రయమా అనేలా తీర్చిదిద్దుతున్నారు

మామిడికుదురు మండలంలోని పెళ్లిలో కొబ్బరి కాయలపై నెమలి ఆకారంలో పింఛాలు ఏర్పాటు చేయడంతో అవి ఎంతో కళాత్మకంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. 

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారిని గోవర్ధన గిరిధారిగా అలంకరించారు. 

విజయవాడ టీచర్స్‌ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో నిర్మించనున్న ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ నూతన భవనానికి గురువారం శంకుస్థాపన చేస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి, సంస్థ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి.

అర్థవీడు: నల్లమల అడవుల ప్రత్యేకతే వేరు. ఎత్తైన కొండలు, పచ్చని గుట్టలు, గలగలపారే వాగులకు నెలవు. ఆకు రాలే కాలంలోనూ ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుంది. 

ఇనుగుర్తి: పసుపు సాగుచేస్తున్న ఈ యువరైతు కూలీల కొరతను అధిగమించేందుకు వినూత్న ప్రయోగం చేశారు. 15 నిమిషాల్లో 5 క్వింటాళ్ల పసుపు కొమ్ములను శుద్ధి (పాలిష్‌) చేసే యంత్రాన్ని తయారుచేసి ఔరా అనిపించారు.

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం విద్యుద్దీపాలతో కళకళలాడుతోంది. ఈనెల 9న అంకురార్పణతో ప్రారంభం కానున్న కల్యాణోత్సవాలకు మరో రెండు రోజులే ఉండటంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

దిల్లీ మెట్రో రైలు గోల్డెన్‌ లైన్‌ నాలుగో దశ ప్రాజెక్టులో భాగంగా కిషన్‌గఢ్‌- వసంత్‌కుంజ్‌ స్టేషన్ల సొరంగం తవ్వకం పనులు గురువారం పూర్తయ్యాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కార్మికులు, అధికారులను అభినందించారు.

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home