#eenadu
మండపేటలో రైతు వేగుళ్ల మురళీకృష్ణకు చెందిన ఒంగోలు ఆవు ఒక్కరోజులో 21.19 కిలోల (20.56 లీటర్లు) పాలు ఇచ్చి సరికొత్త రికార్డు సాధించినట్లు కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు తెలిపారు.
గాజవాక రహదారిపై ఆకట్టుకొనే విధంగా ఈ ఆకృతి ఏర్పాటు చేశారు. టైర్లు, వృథా పరిక రాలతో గిటార్ తరహాలో రూపొందించడంతో అటుగా వెళ్లే ప్రతి ఒక్కరు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
చార్మినార్కు రంగుల శోభ... ప్రపంచ దేశాలకు మన కళా సంస్కృతిని చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన..
నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రాకు హంగులు సమకూరుతున్నాయి. విధులు మరింత సమర్థంగా నిర్వహించేందుకు తాజాగా ప్రభుత్వం కొత్త వాహనాలను అందించింది.
పార్వతీపురం: వైద్యారోగ్య శాఖకు అనుబంధంగా పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని చేస్తున్న సమ్మెలో శిబిరంలో మోకాళ్లపై నిల్చొని ప్లకార్డులు ప్రదర్శించారు.
పీతలవానిపాలెంలో చినపోలమాంబ అమ్మవారి వార్షిక జాతర శ్రీకృష్ణసేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోంది. అమ్మవారిని పసుపు కొమ్ములతో సుందరంగా అలంకరించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో నెదర్లాండ్స్ సుందరి జేన్షానీ నోయిస్టర్
తాళ్లూరు: పదేళ్ల కృషి.. పర్యావరణ రుషి.. ఈ ఈఎన్టీ డాక్టర్ పేరు సుధాకర్. పచ్చదనంతోనే వసుధైక కుటుంబం ఆవిష్కృతమవుతుందని భావించి మొక్కల పెంపకం చేపట్టారు.
శ్రీకాళహస్తి : ఎండ తీవ్రత.. ఉక్కపోత అవస్థలకు ఉపశమనం కల్గిస్తూ ఆకాశమంతా మేఘావృతమైంది. కరిమబ్బులు ముక్కంటి ఆలయాన్ని తాకుతూ వెళ్తూ భారీ వర్షాన్ని కురిపించాయి.