చిత్రం చెప్పేవిశేషాలు
(08-01-2025)
కుక్కల ఆట కట్టించడానికి యూసుఫ్‌గూడలో ఓ వాహన యజమాని బానెట్‌పై ఇలా ప్లాస్టిక్ ముళ్లతో కూడిన మ్యాట్ వేశారు.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ రైతుబజార్‌లో మంగళవారం ఓ భారీ నిమ్మకాయ ఏకంగా 3.80 కిలోల బరువు తూగి అందరినీ ఆశ్చర్యపరిచింది.
నీటి పొదుపు ప్రాధాన్యం వివరిస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయ ప్రహరీపై వేసిన చిత్రం, రాసిన నినాదం అటువైపు వెళ్లేవారిని ఆలోచింపజేస్తుంది.
బడికి వెళ్తూ దారిలో కనిపించిన మేకపిల్లను ఇలా ఎత్తుకుని సంబరపడుతున్న ఓ బాలుడు ఘోడే కీ ఖబర్ రోడ్డులో కనిపించాడు
లక్ష కుంకుమార్చన, లక్ష బిల్వపూజ.. ఇలాంటివి ఆలయాల్లో వేడుకల వేళ జరగడం పరిపాటి. ఈ కోవలోనే.. లక్ష వడలతో ఇదో విశేషమైన పూజ.
గచ్చిబౌలి మార్గంలో మంగళవారం రాత్రి లైట్ల వెలుగుల్లో అవుటర్ రింగ్‌రోడ్డు కనిపించిందిలా. కనుచూపు మేర భారీ బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో వెలుగులు కనువిందు చేస్తున్నాయి.
బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో ఐలా వలలతో చేపల వేట సందడి మొదలైంది. ఒక్కొక్కటి రూ.25 లక్షల విలువ చేసే ఈ వల పొడవు కిలోమీటరు వరకు ఉంటుంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారు మంగళవారం బలరామావతారంలో దర్శనమిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు ప్రత్యేక అతిథులుగా బుట్ట కమలాలు వచ్చాయి. బంగారు వర్ణంలో ఉన్న ఈ మొక్కలను చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది.
షాద్‌నగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు ఆగిపోయింది. డ్రైవర్ వినతితో దారిన పోయే బాటసారులు వాహనాన్ని నెడుతూ తిరిగి స్టార్ట్ అయ్యేందుకు సహకరించారు.