చిత్రం చెప్పే విశేషాలు

(08-03-2025)

రంగంపేట: మహిళలపై సమాజంలో ఉన్న వివక్షతను వ్యతిరేకిస్తూ ఇసుక రేణువులను ఏకం చేసి దేవిన సోదరీమణులు రూపొందించిన సైకతం ఆకట్టుకుంటోంది.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో విశేష పర్వాలు శుక్రవారం రాత్రి ఎదుర్కోలు వేడుకతో మొదలయ్యాయి. 

తాడిపత్రి : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వినూత్న ప్రదర్శన.

ప్రపంచంలోనే అతి పెద్ద ‘పెన్‌ షో’ చెన్నై అడయార్‌లో శుక్రవారం ప్రారంభమైంది. 3500 రకాల కలాలు కొలువుదీరిన ఈ ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగుతుంది.

దిల్లీలోని తుగ్లక్‌లేన్‌లో శుక్రవారం కేంద్ర మంత్రి క్రిషన్‌పాల్‌ గుర్జర్, భాజపా ఎంపీ దినేశ్‌శర్మల అధికారిక నివాసాల వద్ద కనిపించిన చిరునామా ఫలకాలు ఇవి. వీటిలో వీధి పేరు వివేకానంద మార్గ్‌గా ఉంది. 

దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ఏర్పాటుచేసిన ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతోషం వ్యక్తం చేశారని స్టాల్‌ ఏర్పాటుచేసిన అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక హస్త కళాకారుడు పెదపాటి శరత్‌ చెప్పారు.

వనితల ‘స్మార్ట్‌’ వెలుగులు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్న వేళ విద్యుత్తు అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగినులు తమ స్మార్ట్‌ ఫోన్లతో ఆడిటోరియంలో వెలుగులు నింపారు. 

నూతనకల్‌: సాయంసంధ్య వేళ నింగి అరుణవర్ణమై నేల హరితశోభితమై ప్రకృతి అందాన్ని ద్విగుణీకృతం చేసింది. సగం ఆకులు రాలిన చెట్ల నుంచి భానుడి కిరణాలు నేలకు తాకుతున్నట్లు ఆహ్లాదం కలిగించాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(19-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(19-03-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(18-03-2025)

Eenadu.net Home