చిత్రం చెప్పేవిశేషాలు
(09-01-2025)
సాధారణంగా సొరకాయలు అడుగున్నర పొడవు కాస్తాయి. పాపయ్యపేట గ్రామానికి చెందిన లింగాల సాయిలు ఇంట్లో సుమారు 4 అడుగులు కాశాయి. వీటిని చుట్టుపక్కల వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపించే నివాసం, ఎక్కడో గిరిజన పర్యాటక కేంద్రంలో సందర్శకుల కోసం తీర్చిదిద్దినది అనుకుంటే పొరపాటే. నివాసానికి రంగులు వేసి చూడముచ్చటైన బొమ్మలు వేశారు.
ప్రధాని నరేంద్రమోదీ భువనేశ్వర్ రాకకు ముందుగా ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ జనతా మైదానంలో జగన్నాథుని చిత్రం వద్ద మోదీ ప్రణమిల్లుతున్న దృశ్యాన్ని తీర్చిదిద్దారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.
పచ్చగడ్డిని కోస్తుంది.. ముక్కలుగా అందిస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధునిక పరికరాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పదిమంది చేసే పనిని గంటలో పూర్తిచేసే యంత్రాలు వచ్చాయి.
ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు.
మహా కుంభమేళా నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాలు.
హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు జనగామ మీదుగా విద్యుత్తు బస్సులు నడుస్తున్నాయి. జనగామలోని ఆర్టీసీ చౌరస్తాలో బుధవారం విద్యుత్తు బస్సు స్థానికులను ఆకట్టుకుంది.
సూర్యరశ్మి ద్వారా లభ్యమయ్యే విటమిన్-డి శిశువులకు శ్రేయస్కరమని వైద్యులు చెబుతారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రి ఆవరణలో బుధవారం కుటుంబ సభ్యులు నవజాత శిశువులను ఒడిలో పడుకోబెట్టుకొని సూర్యరశ్మి అందించేందుకు ప్రయత్నిస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి దీపోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
గుండ్రటి ఆకృతిలో బంతిని తలపించేలా క్యారెట్ పాయకరావుపేట మార్కెట్‌లో బుధవారం కనిపించింది. రెండు అంగుళాల పొడవుతో అకస్మాతుగా చూస్తే చిన్నసైజు పైనాపిల్‌లా చూడముచ్చటగా కనిపిస్తోంది.
మంచు దుప్పటి కప్పుకొన్న తాజ్‌మహల్.