చిత్రం చెప్పేవిశేషాలు

(09-01-2025)

మెట్‌పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన గుండు భాగ్యలక్ష్మి గీసిన చిత్రం ఆకట్టుకుంటున్నాయి. 

విశాఖపట్నంలో జరుగుతున్న ఏపీ డిజిటల్‌ టెక్నాలజీ సమిట్‌-2025లో గురువారం రోబో శునకం అందరినీ ఆకట్టుకుంది.

భద్రాచలంలో గురువారం సాయంసంధ్య వేళ సీతారాముల వారి తెప్పోత్సవం వైభవోపేతంగా జరిగింది. హంసాలంకృత వాహనంలో శ్రీసీతారాములు విహరించారు.

కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, వాటర్‌ బాటిళ్లల్లో మొక్కలు నాటి ప్రత్యేకత చాటుతున్నారు ఖమ్మంలోని గాంధీచౌక్‌ పార్క్‌ ఇన్‌ఛార్జి కె.శ్రీనివాస్‌. కొబ్బరి చిప్పల్లో నాటిన మనీప్లాంట్, అలంకరణ మొక్కలు అబ్బురపరుస్తున్నాయి. 

సంక్రాంతి పండగ గ్రామాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని పట్టణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్లెక్సీ కట్టి పలు సూచనలు చేశారు.

చైనాలోని హేలోన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ హర్బిన్‌లో ద హర్బిన్‌ ఐస్‌ అండ్‌ స్నో వరల్డ్‌ ఉత్సవంలో ఏర్పాటుచేసిన మంచు కట్టడాల వద్ద సందర్శకుల సంబరం .

విజయవాడ కొత్తాసుపత్రి నుంచి రామవరప్పాడు రింగు వరకు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి, సర్వీస్‌ రోడ్డు మధ్యలో పార్కు ఏర్పాటు చేశారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలో అలంకరించారు.

గగనంలో విహరించే సమయంలో ఈల మాదిరిగా కూత పేడుతూ బాతు వంటి ఆకారంతో చూపరులను ఇట్టే ఆకర్షించే కొల్లేరు అందాల అతిథి లెస్సర్‌ విస్లింగ్‌ డక్‌.

లక్డీకాపూల్‌ సంత్‌నిరంకారి భవన్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ బొమ్మలు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఇద్దరు చిన్నారులు పిల్లనగ్రోవి ఊదుతుండగా.. అందులోంచి జల్లులు ఫౌంటేయిన్‌లా చిమ్ముతూ ముచ్చటగొలుపుతున్నాయి.  

చిత్రం చెప్పే విశేషాలు(05-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(04-02-2025)

Eenadu.net Home