#eenadu

#eenadu

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇటీవల ప్రభుత్వం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చింది. గురువారం నూతన నామఫలకాన్ని ఏర్పాటు చేశారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌ పుట్టినరోజు సందర్భంగా నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గురువారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

 ప్రముఖ క్షేత్రమైన యాదగిరిగుట్ట విద్యుత్తు కాంతులతో ముస్తాబైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి నారసింహ జయంతి వార్షిక మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

#eenadu

మిస్‌ వరల్డ్‌ పోటీల నేపథ్యంలో నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రపంచ సుందరి కిరీటం నమూనా ఆకట్టుకుంటోంది. 

విశాఖ తీరం వేగంగా కోతకు గురౌతుంది. ఆ తీవ్రతను నిరోధించేందుకు పలు ప్రాంతాల్లో కొబ్బరి వనాలు పెంచుతున్నారు. అయితే ఇటీవల ఆర్కేబీచ్‌ తీరంలో కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. 

దిల్లీలో గురువారం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌ సహా పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు 

భూపాలపల్లి జిల్లా: సుందరమైన నిర్మాణం జ్ఞాన దీపం.. రెండు హస్తాల మధ్యన తాళపత్రాలు పొందుపర్చి, పై భాగంలో దీపం, కాంతి చిత్రాలతో నిర్మాణం ఉంటుంది. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(08-05-2025)

Eenadu.net Home