చిత్రం చెప్పేవిశేషాలు

(01-01-2025)

గచ్చిబౌలి ఎస్కీ కళాశాల నుంచి ఖాజాగూడకు వెళ్లే మార్గంలో బండరాళ్లపై చూడముచ్చటైన బొమ్మలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 

బ్రీడింగ్‌ కోసం తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మలూరుకు కారులో తీసుకెళ్తుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 

కడియంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ రకాల మొక్కలతో ఏర్పాటుచేసిన ఆకృతి ఇది. సత్యనారాయణ గార్డెన్స్‌లో ఆకట్టుకుంటోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు. 

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రఖ్యాత డీజే చేతస్‌ ప్రదర్శనలో సందర్శకుల కేరింతలు 

సాధారణంగా ఒక మొక్క ఒకే రంగు పూలు పూస్తుంది. అదే.. నాలుగైదు రంగుల పుష్పాలు వికసిస్తే కనులవిందుగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఓ నర్సరీ నిర్వహకులు ప్రయత్నమే ఇది.

2025 ఆకృతిలో దుత్తలూరులోని విశ్వతేజ పాఠశాల విద్యార్థుల స్వాగతం పలికారు.

 భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత శ్రీ రాసపోలమాంబను వంకాయలతో మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. విభిన్న రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి పలువురు భక్తులు పూజలు చేశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(04-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(03-01-2025)

Eenadu.net Home