చిత్రం చెప్పే విశేషాలు

(10-02-2025)

మానకొండూర్‌ ఎంఈవో కార్యాలయ సమీపంలో ఇటీవల నిర్మించిన అంగన్‌వాడీ భవనానికి వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

11వ తేదీ నుంచి జరగనున్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్దతిరునాళ్ల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో సర్వాంగసుందరంగా అలకరించారు. విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్న 

ఆలయాన్ని భక్తులు కనులారా వీక్షిస్తున్నారు. 

కేసీఆర్‌పై అభిమానంతో ఆయన పుట్టినరోజు (ఈ నెల 17) సందర్భంగా గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన యువరైతు సింగూరు విజయ్‌కుమార్‌ తన వరినారు మడిలో కేసీఆర్‌ అక్షరాలను పెంచి అభిమానం చాటుకున్నాడు.  

జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఈ ప్రాంతం కళకళలాడింది. 

 ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేసే పచ్చని అందాలు, సెలయేర్లతో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది.

తెట్టు అటవీ ప్రాంతంలో నెమళ్లు సందడి చేస్తున్నాయి... ఉదయం, సాయంత్ర వేళల్లో తెట్టు సమీప గ్రామాల ప్రజలకు నెమళ్ల అరుపులు వీనులవిందుగా మారగా, గుంపులుగా సంచరిస్తూ కన్పిస్తున్నాయి.

అంతర్వేది నారసింహుడు స్వర్ణకాంతులతో మెరిసిపోతూ ఉభయ దేవేరులతో కలిసి వాహనాలపై విహరించి భక్తులను పరవశింపజేశారు.

 విశాఖ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. 

పాలకడలిలా మంచును చీల్చుకుంటూ వస్తున్న ఈ కొండను చూస్తే మీకేమనిపిస్తోంది... ఏ అరకులోనో, లంబసింగినో అనుకుంటున్నారా... మదనపల్లె పట్టణ శివారులోని బసినికొండ అందాలివి. 

ఒకప్పుడు ఇరుకిరుకుగా... నిత్యం రక్తమోడుతూ కన్పించిన దారిది... నేడు కనుచూపుమేర విశాలంగా వాహన చోదకులకు స్వర్గధామంగా మారింది.. మదనపల్లె శివారు అంగళ్లు వద్ద తీసిన చిత్రమిది. 

చిత్రం చెప్పే విశేషాలు(13-03-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(13-03-2025)

చిత్రం చెప్పే విశేషాలు(12-03-2025)

Eenadu.net Home