చిత్రం చెప్పే విశేషాలు
(10-03-2025)
దిల్లీలో రాష్ట్రపతి భవన్ వద్ద జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ‘వివిధ్‌తా కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో రాష్ట్రం తరఫున శ్రీకాకుళం జిల్లా తప్పెట గుళ్ల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది.
వేల్పూర్ మండలం పడగల్‌కు చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. సెం.మీ. ఎత్తులో రూపొందించారు.
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
అన్నమయ్య జిల్లా కలికిరిలో కశ్మీరీ మేక చూపరులను ఆకట్టుకుంటోంది. ‘కశ్మీరీ జాతి మేకలు పొట్టిగా దృఢంగా ఉంటాయి. వీటి పాలు ఎంతో శ్రేష్టం. పెరుగూ బాగుంటుంది’ అని చెప్పారు.
చాదర్‌ఘాట్: ఒకప్పుటి వెదురుబుట్టలు.. ఇప్పుడు కొత్తరూపు సంతరించుకున్నాయి. ఎంతో ఖర్చు పెట్టి చేసే శుభకార్యాల్లో వినియోగించే బుట్టలను అంతే గ్రాండ్‌గా కనిపించేలా రంగులు అద్దుతున్నారు.
రెండు రకాల రంగుల్లోకి మారడం ఈ మిక్కీ మౌస్ పువ్వు ప్రత్యేకత. ఇది విశాఖ పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో కనిపిస్తోంది.
రాజపేట: ఒక చెరుకు మొక్కకు 59 గడలు కాయడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
విశాఖ నగరం పరిధి కంచరపాలెం రైతు బజార్‌లో ఓ రైతు విక్రయించడానికి తీసుకొచ్చిన దుంపల్లో ఓ ముల్లంగి పిడికిలి బిగించిన చేయి ఆకారంలో కనిపించింది.
సుందరీకరణలో భాగంగా జిల్లెలగూడ చెరువులో గతేడాది ఏర్పాటు చేసిన పక్షుల బొమ్మలు నిర్వహణ లేక శిథిలమయ్యాయి. చెరువంతా గుర్రపుడెక్కతో నిండిపోయింది.