#eenadu
చారిత్రక నంజనగూడు పట్టణం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది.
టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తన భార్య ధనశ్రీ వర్మ.. ఆమె ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అమరావతిలోని వెలగపూడిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయడంతో రాజధాని ప్రాంత రైతులు శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి పక్కన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అబుధాబిలో జరుగుతున్న 100 మిలియన్ డాలర్ల విలువైన ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాల ప్రదర్శనలో ఆకట్టుకున్న పది క్యారట్ల నీలం రంగు వజ్రమిది.
చీతా హెలికాప్టర్ ముందు సగర్వంగా నిలబడిన ఈ యువతి పేరు కెప్టెన్ శ్రద్ధ. భారత సైన్యంలోని చీతా దళంలో తొలి మహిళా పైలట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
జపాన్‌లోని ఒసాకాలో ఎక్స్‌పో-2025 ప్రారంభం నేపథ్యంలో బుధవారం మీడియా ప్రతినిధుల ఎదుట ప్రదర్శించిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) ఎయిర్‌క్రాఫ్ట్
అమరావతి: పెద్ద చెవులు, బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ పొట్టి జాగిలం సీఎం భద్రతా విభాగంలో సేవలందిస్తోంది.
ఓ చంటి పిల్లాడిని తల్లి ఆడిస్తున్నట్లుంది కదూ. ఈ బొమ్మను చూస్తే.. హైదరాబాద్‌లోని టోలీచౌకి హకీంపేట కూడలిలో సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన తల్లీబిడ్డల ఆకృతి అటుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీ నుంచి ఓ భారీ వాహనం (సుమారు 90 టైర్లు)పై నూతన రైలు ఇంజిన్‌ను కర్ణాటకలోని బళ్లారికి రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు.