చిత్రం చెప్పేవిశేషాలు

(10-12-2024)

సోమవారం దిల్లీ పార్లమెంటు ఆవరణలో అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాస్కులతో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రధాని, అదానీల చిత్రాలతో ఉన్న వినూత్నమైన బ్యాగులు ధరించి నిరసన తెలిపారు.

తెలంగాణ చరిత్ర కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.

తెలంగాణ తల్లి నూతన రూపాన్ని నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ టేకు ఆకులపై ఆవిష్కరించారు. 

జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగిరెడ్డిచెరువు గట్టునున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి సోమవారం రాత్రి 108 రకాల పదార్థాలతో నైవేద్యం సమర్పించారు

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణaలో ఆర్జా వర్షిణి ఫ్యూజన్ బృందం దశావతారం నృత్య ప్రదర్శన.

చూపరులను ఇట్టే ఆకట్టుకునే కొల్లేరు అందాల అతిథి యూరేషియన్‌ స్పూన్‌బిల్‌. ఈ పక్షులు కొల్లేరులో 400 వరకు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

నేడు తెలంగాణ మంత్రి సీతక్క ప్రియాంక గాంధీని దిల్లీలో కలిశారు. వయనాడ్ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

నీటిలో చీరలతో ఊయలలు కట్టి చేపలకు గాలం వేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రవాహంలో చేపలు ఎగిరి చీరలో పడుతూ చూపరులను కనువిందు చేస్తున్నాయి. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home